మెగా ఛాన్స్ కొట్టేసిన మహేష్ డైరెక్టర్

ఈ ఏడాది సరిలేరు నీకెవ్వరు సినిమాతో అదిరిపోయే సక్సెస్ కొట్టాడు దర్శకుడు అనిల్ రావిపూడి.మహేష్ బాబును చాలా ఎనర్జిటిక్‌గా చూపించాడు దర్శకుడు అనిల్ రావిపూడి.

 Anil Ravipudi Got Call From Mega Family-TeluguStop.com

ఈ సినిమాతో మహేష్ కెరీర్‌లో సెన్సేషనల్ హిట్ అందించాడు ఈ డైరెక్టర్.దీంతో ఇప్పుడు అనిల్ రావిపూడితో సినిమా చేసేందుకు పలువురు స్టార్ హీరోలు ఆసక్తి చూపుతున్నారు.

అయితే అనిల్ రావిపూడికి మరో బంపర్ ఆఫర్ వచ్చి పడినట్లు తెలుస్తున్నాయి.ఈయన స్టైల్ నచ్చిన మెగా ఫ్యామిలీ, అనిల్ రావిపూడికి కాల్ చేసినట్లు తెలుస్తోంది.చిరంజీవి స్వయంగా ఈ కాల్ చేసినట్లు, అనిల్ రావిపూడిని ఓ మంచి కథను రెడీ చేయాల్సిందిగా ఆయన కోరాడట.దీంతో అనిల్ రావిపూడి సంతోషానికి అవధలు లేకుండా పోయాయని తెలుస్తోంది.

ఇక ఈ సినిమాకు సంబంధించిన పనులను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చూసుకుంటాడని తెలుస్తోంది.

కాగా ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమా తరువాత అనిల్ రావిపూడి సినిమా కథ రెడీ చేస్తే, ఆయనతో సినిమా చేస్తాడు, లేకపోతే త్రివిక్రమ్ డైరెక్షన్‌లో చిరు సినిమా చేసే ఛాన్సు ఉందని తెలుస్తోంది.కాగా అనిల్ రావిపూడి ప్రస్తుతం F3 సినిమా కథను రెడీ చేసే పనిలో పడ్డాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube