వెంకీ మామ చిత్రంతో బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అందుకున్నాడు విక్టరీ వెంకటేష్.ఇక ఈ సినిమా తరువాత తమిళంలో సూపర్ హిట్ అయిన ‘అసురన్’ చిత్రాన్ని రీమేక్ చేస్తున్నాడు వెంకటేష్.
శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ‘నారప్ప’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు చిత్ర యూనిట్.
ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్లను ఇటీవల రిలీజ్ చేశారు చిత్ర యూనిట్.
వెంకటేష్ రఫ్ లుక్‌తో ప్రేక్షకులను మెప్పించాడు.కాగా ఈ సినిమాలో వెంకటేష్ సరసన హీరోయిన్‌గా ప్రియమణిని సెలెక్ట్ చేశారు చిత్ర యూనిట్.
అయితే ఈ సినిమాలో మరో ముఖ్యమైన పాత్రలో నటించేందుకు మరో హీరోయిన్ అమలా పాల్‌ను తీసుకోనున్నట్లు తెలుస్తోంది.అమలాపాల్‌కు ఈ సినిమాలో అదిరిపోయే ఎంట్రీ ఉంటుందని, కథలో ఆమె పాత్ర చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంటుందని తెలుస్తోంది.
రాయలసీమ యాసలో తెరకెక్కనున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం అనంతపురంలో జరుగుతోంది.సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఈ సినిమాను సురేష్ బాబు ప్రొడ్యూస్ చేస్తున్నాడు.మరి ఈ సినిమా ఎలాంటి సక్సెస్‌ను అందుకుంటుందో చూడాలి.







