టాలీవుడ్‌లో ప్రస్తుతం తెరకెక్కుతున్న చిత్రాల్లో తమిళ చిత్రం 96కు తెలుగు రీమేక్ అయిన జాను సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి.తమిళంలో సూపర్ సక్సెస్ అయిన ఈ సినిమాను తెలుగులో యంగ్ హీరో శర్వానంద్, స్టార్ బ్యూటీ సమంత జంటగా తెరకెక్కించారు.
ఈ సినిమాను ఫిబ్రవరి 7న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యారు.
అయితే ఈ సినిమా ప్రమోషన్స్ విషయంలో చిత్ర యూనిట్ చాలా నెమ్మదిగా వ్యవహరిస్తోంది.
ఇప్పటి వరకు కేవలం ట్రైలర్ మాత్రమే రిలీజ్ చేసిన చిత్ర యూనిట్, ఫిబ్రవరి 1న ప్రీరిలీజ్ ఈవెంట్‌ను జరపనున్నారు.ఆ తరువాత డైరెక్ట్‌గా సినిమాను రిలీజ్ చేసేందుకే వారు ప్రాధాన్యతనిస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రేక్షకుల్లో ఈ సినిమాపై అంచనాలు పెంచే కార్యక్రమాన్ని చేపట్టడంలో చిత్ర యూనిట్ చాలా లైట్ తీసుకున్నట్లు తెలుస్తోంది.
స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తుండటంతో దీనిపై మంచి బజ్ ఉండాలి.
అటు శర్వానంద్, సమంత సినిమాలంటే ఫ్యామిలీ ఆడియెన్స్‌లో కనీస బజ్ కూడా లేకుండానే ఈ సినిమాను రిలీజ్ చేస్తే రిజల్ట్‌లో తేడా కొట్టడం ఖాయమని అంటున్నారు సినీ విశ్లేషకులు.మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి అంటున్నారు సినీ క్రిటిక్స్.







