సినిమా ఇండస్ట్రీ అన్న తర్వాత మహిళలు ఎన్నో రకాల ఇబ్బందులను ఎదుర్కొంటారనే విషయం మనకు తెలిసిందే.చిన్న ఆర్టిస్టుల నుంచి మొదలుకొని హీరోయిన్ల వరకు కూడా ఎన్నో వేధింపులకు గురి అవుతూ ఉంటారు.
ఇలా చాలామంది క్యాస్టింగ్ కౌచ్ ( Casting couch ) ఎదుర్కొన్నటువంటి వారే ఇండస్ట్రీలో కొనసాగుతూ ఉన్నారని చెప్పాలి .అయితే ఇలాంటి క్యాస్టింగ్ కౌచ్ ఇబ్బందులు ప్రతి ఒక్కచోట ఉంటాయి కానీ మన వ్యవహార శైలిని బట్టి మనం వాటికి లొంగిపోవాలా లేదా అన్నది ఆధారపడి ఉంటుంది.ఇలా ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఎంతో మంది సెలబ్రిటీలు పలు ఇంటర్వ్యూల సందర్భంగా తాము క్యాస్టింగ్ కౌచ్ బాధితులమే అంటూ చెప్పిన సందర్భాలు ఉన్నాయి.అయితే తాజాగా టాలీవుడ్ ఇండస్ట్రీలో యాంకర్ గా నటిగా సీరియల్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించినటువంటి వారిలో శ్యామల ( Anchor Syamala ) ఒకరు.
ఈమె కూడా ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లో ఈ విధమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొన్నానని ఇటీవల ఒక ఇంటర్వ్యూ సందర్భంగా చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఈమె కెరియర్ మొదట్లో తన తల్లితో పాటు హైదరాబాద్( Hyderabad ) కి వచ్చి సీరియల్లో నటించే అవకాశాలను అందుకున్నారు. ఇలా ఏకంగా మూడు సీరియల్స్ లో అవకాశాలను అందుకున్నటువంటి ఈమె ఎన్నో ఇబ్బందులను కూడా ఎదుర్కొన్నానని తెలియజేశారు.తాను సీరియల్స్ చేస్తున్నప్పుడు చాలా ప్రపోజల్స్ వచ్చాయని తెలిపారు.
కొంతమంది అర్ధరాత్రి పూట ఫోన్ చేసి చాలా విసిగించారని కూడా ఈమె ఈ సందర్భంగా వెల్లడించారు.తాను పనిచేస్తున్నటువంటి ఒక సీరియల్ కెమెరామెన్( Serial Cameraman ) తనని ప్రతిరోజు విసిగించేవాడు.
అయితే ఒకరోజు అర్ధరాత్రి ఫోన్ చేయగా అమ్మ లిఫ్ట్ చేసిందని తెలిపారు.మీ అమ్మాయితో నేను మాట్లాడుతుంటే కనీసం పట్టించుకోవడం లేదు మీకు మగదిక్కు కూడా లేరు నేను ఏమైనా చేయగలను అంటూ తనని బెదిరించారని, ఇలా కెరియర్ మొదట్లో ఇబ్బందులను ఎదుర్కొన్న నేను బాగా భయపడిపోయానని కమిట్ అయినటువంటి మూడు సీరియల్స్ చేసి ఇక తిరిగి ఇంటికి వెళ్లి పోవాలని నిర్ణయం కూడా తీసుకున్నానని ఈ సందర్భంగా శ్యామల కాస్టింగ్ కౌచ్ ఇబ్బందుల గురించి వెల్లడించారు.
ఇక ఇండస్ట్రీలో ఇలాంటివన్నీ మామూలే అని కొందరు ఈమెకు ధైర్యం చెప్పడంతో వెనకడుగు వేయకుండా ధైర్యంగా ముందుకు వెళ్లారు.ఇలా సీరియల్స్ చేస్తూనే అనంతరం యాంకర్ గా కూడా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.ఇక శ్యామల మరొక సీరియల్ నటుడు నరసింహారెడ్డి ( Narasimha Reddy ) అనే వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.ప్రస్తుతం ఈమె పలు సినిమాలలో కీలక పాత్రలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.