నేను హనుమాన్ పరమ భక్తురాలిని.. అనసూయ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

నేడు అయోధ్యలో శ్రీరాముడు ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరుగుతున్నటువంటి నేపథ్యంలో దేశం మొత్తం భక్తి భావంతో నిండిపోయింది.ప్రతి ఒక్కరు కూడా జైశ్రీరామ్ ( Jai sriram ) అంటూ స్వామివారి అద్భుతమైన ఘట్టం చూడటానికి ఆసక్తి కనబరిచారు.

 Anasuya Latest Post On Ayodhya Ram Mandir ,anasuya, Hanuman Ayodhya Ram Mandir,-TeluguStop.com

ఇక ఈ కార్యక్రమం జరగబోతున్నటువంటి తరుణంలో ఎంతో మంది సెలబ్రిటీలు అయోధ్యకు చేరుకున్న సంగతి మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే అయోధ్య రామ మందిరం ప్రతిష్ట జరుగుతున్నటువంటి తరుణంలో నటి అనసూయ సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి పోస్ట్ వైరల్ గా మారింది.

ఈ సందర్భంగా అనసూయ( Anasuya ) ఇంస్టాగ్రామ్ వేదికగా స్పందిస్తూ.ఎంతో సంతోషాన్ని కలిగించే రోజు ఇది.నేను హనుమంతుడికి పరమ భక్తురాలిని.ఆయన పేరు వచ్చేలాగే నా కొడుకు పేరు కూడా పెట్టాం.

శ్రీరాముడే హనుమంతుడికి సర్వస్వం. ఎప్పుడో జరగాల్సిన కార్యక్రమం ఇది.ఇప్పుడు జరుగుతుంది.శ్రీసీతా లక్ష్మణ సమేత శ్రీరాముడిని అయోధ్యలో ధరించుకునేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా.

రానున్న రోజుల్లో అది నెరవేరుతుంది. జై శ్రీరామ్ అంటూ అనసూయ చేసిన ఈ పోస్ట్ వైరల్ గా మారింది.

అనసూయ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న తనకు వీలు కుదిరినప్పుడల్లా దైవ దర్శనాలకు వెళ్లడం ఇంట్లో ప్రత్యేకంగా పూజలు చేయించడం మనం చూస్తుంటాము.ఇలా ఈమెలో కూడా ఎంతో భక్తి భావం ఉందనే విషయం తెలిసిందే అయితే తాజాగా తాను హనుమంతుని పరమ భక్తురాలు అంటూ అయోధ్యను ఉద్దేశించి ఈమె చేసినటువంటి పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.అనసూయ ప్రస్తుతం సినిమాలో పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.త్వరలోనే ఈమె పుష్ప 2 సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు ఈ సినిమా ఆగస్టు 15వ తేదీ విడుదల కాబోతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube