అమెరికా చేసిన అప్పుల ప్రభావం భారత్‌పై పడనుందా?

అగ్రరాజ్యం అమెరికా( America )ని ఆర్ధికంగా మిగతా దేశాలకంటే మిన్న అని పరిగణిస్తారు.అవును, ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అమెరికా వెలుగొందుతోంది.

అయితే నిన్న మొన్నటి మాట.నేటి అమెరికా ఆర్ధిక వ్యవస్థ గురించి మాట్లాడుకోవాలంటే కాస్త అటు ఇటు అయిన పరిస్థితి.అవును, అగ్రరాజ్యం ఆర్థికమాంద్యంతో అప్పులలో కూరుకుపోయింది.

అమెరికా ఆర్థిక వ్యవస్థ విలువ 23 లక్షల కోట్ల డాలర్లు( America Financial Problems )గా వుంది.కాగా ఇప్పుడు మరిన్ని అప్పులు తీసుకునేందుకు అమెరికా సిద్ధపడగా పార్లమెంట్ దానికి అనుమతి ఇస్తుందో లేదోనన్న పరిస్థితి వుంది.

అలాంటి పరిస్థితి కారణం క్వాడ్ సమావేశం( Quad Summit ) అని అంటున్నారు నిపుణులు.ఆ మధ్య క్వాడ్ సమావేశాన్ని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్( Joe Biden ) రద్దు చేయడమే నేటి ఆర్ధిక వ్యవస్థ దిగజారుడుతనానికి కారణమని నిపుణులు అంటున్నారు.చైనాకు వ్యతిరేకంగా ఏర్పడిన నాలుగు దేశాల కూటమినే క్వాడ్ అని పిలుస్తున్నారు.

Advertisement

అమెరికా అధ్యక్షుడు అప్పు తీసుకోవడానికి యూఎస్ కాంగ్రెస్( US Congress ) అనుమతి అవసరం.కానీ, ప్రస్తుతానికి ఇది కష్టంగా కనిపిస్తోంది.అంతవరకూ ఓకే గానీ ఇపుడు పెద్దన్న చేసిన పనికి కొన్ని దేశాలు ప్రభావితం కానున్నాయని స్పష్టంగా అర్ధం అవుతోంది.

అవును, భారత్, అమెరికా సహా ప్రపంచంలోని చాలా దేశాలది లోటు బడ్జెట్ అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఇక్కడ ప్రభుత్వానికి పన్నుల రూపంలో వచ్చే రాబడి కంటే ప్రభుత్వం చేసే ఖర్చు ఎక్కువగా ఉంటుంది.ఇలాంటి పరిస్థితుల్లో ఖర్చుల కోసం ప్రభుత్వాలు అప్పు చేయాల్సి ఉంటుంది.

అమెరికాలో ఇది సర్వసాధారణ ప్రక్రియ.అమెరికాలో ఆర్థికమాంద్యం ఉండడంతో భారత సాఫ్ట్‌వేర్ పరిశ్రమ( Software Industry ) మందగమనంలో నడుస్తోంది.

అన్నింటికంటే పెద్ద విషయం ఏంటంటే ప్రపంచం అంతటా డాలర్లతోనే వ్యాపారం జరుగుతుండడం వలన ఇపుడు అమెరికా ఎఫెక్ట్ భరత్ పైన కూడా ఎంతోకొంత ఉండబోతుందని భోగట్టా.

వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 
Advertisement

తాజా వార్తలు