6 అడుగుల దూరం పాటించలేదని 30 వేల జరిమానా, ఎక్కడంటే

కరోనా వైరస్ అగ్రరాజ్యం అమెరికా లో కూడా తీవ్ర ప్రాణనష్టం కలిగిస్తున్న సంగతి తెలిసిందే.దేశవ్యాప్తంగా మొత్తం 68,472 కేసులు నమోదు కాగా, ఇప్పటికే1032 మంది మృత్యువాత పడ్డారు.

 Fremont California Cops Issue 400 Civil Ticket Over Covid-19 Distancing, America-TeluguStop.com

కేవలం ఒక్కరోజులోనే 164 మంది మరణించడంతో అక్కడ ఇప్పటికే హెల్త్ ఎమర్జెన్సీని కూడా విధించారు.మరోపక్క కరోనా ను భారీ విపత్తుగా ఆదేశ అధ్యక్షులు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించారు కూడా.

అంతేకాకుండా ఇప్పటికే ఆ దేశంలో చాలా ప్రాంతాలలో లాక్ డౌన్ లు విధిస్తూ నిర్ణయం కూడా తీసుకున్నాయి.ప్రస్తుతం కాలిఫోర్నియా లో కూడా లాక్ డౌన్ కొనసాగుతుంది.

ఈ వైరస్ మహమ్మారి కట్టడి చర్యల్లో భాగంగా కాలిఫోర్నియాలోని ఫ్రీమాంట్ నగర పోలీసులు ఒక వ్యక్తికి ₹30వేల జరిమానా విధించాల్సి వచ్చినాట్లు తెలుస్తుంది.ఉదయానే ఫ్రీమాంట్ నగరంలో నడకకు ఉపక్రమించిన ఓ వ్యక్తికి అదే దారిలో నడుస్తున్న మరో వ్యక్తి తారసపడడం తో ఇరువురూ సంభాషించుకుంటూ ఉండిపోయారు.

అయితే ఇదంతా గమనించిన స్థానిక పోలీసులు విషయం తెలుసుకొని ఇద్దరూ కూడా పాటించాల్సిన కనీస దూరం పాటించలేదన్నట్లు గుర్తించారు.దీనితో 6అడుగుల దూరం పాటించాలనే నిబంధన ఉల్లంఘించినందుకు $400(₹30వేలు) జరిమానా విధించినట్లు తెలుస్తుంది.

చైనా లో మొదలైన ఈ కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తుంది.ఇప్పటికే ఈ కరోనా మరణాలు ప్రపంచ వ్యాప్తంగా 20 వేలకు పైగా నమోదు కాగా, చైనా,ఇటలీ ల తరువాత అత్యధిక కరోనా మరణాలు చోటుచేసుకున్న దేశంగా అమెరికా నిలిచింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube