టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి ( Sneha Reddy )గురించి మనందరికీ తెలిసిందే.ఈ మధ్యకాలంలో తరచూ ఏదో ఒక విషయంతో స్నేహా రెడ్డి పేరు సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉంది.
మొన్నటి వరకు ఇంటి బాధ్యతలు చూసుకుంటూ పిల్లల బాధ్యతలు చూసుకుంటూ ఇంటిపట్టునే కడిపిన స్నేహ రెడ్డి ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండడంతో పాటు తరచూ వార్తల్లో నిలుస్తూ వస్తోంది.ఇంకా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఆమె ఈ మధ్య గ్లామర్ ఫోటోలను షేర్ చేయడంతో పాటు తన పిల్లలకు సంబంధించిన ఫోటోలు వీడియోలు షేర్ చేస్తూనే ఉంది.
అలా స్నేహా రెడ్డి షేర్ చేసే వీడియోలు, ఫోటోల కోసం బన్నీ ఫ్యాన్స్‌లో ఎక్కువ మంది ఆమెను ఇన్ స్టాలో ఫాలో అవుతుంటారు.బన్నీ( Bunny ) భార్యగా స్నేహారెడ్డికి నెట్టింట్లో ఫుల్ క్రేజ్ ఉంటుంది.ఏ స్టార్ హీరో భార్యకి లేనంత సోషల్ మీడియా ఫాలోయింగ్ స్నేహారెడ్డికి ఉందని చెప్పవచ్చు.ఇది ఇలా ఉంటే తాజాగా స్నేహా రెడ్డి తాజాగా పిల్లల పెంపకం మీద ఓ వీడియోను షేర్ చేశారు.
మామూలుగానే ఈ తరం పిల్లలు తల్లిదండ్రుల మాటలు ఎక్కువగా వినరు.స్కూల్ వర్క్స్‌తోనే వారికి భారం పెరిగి పోతుంటుంది.వారిలో ఉన్న క్రియేటివిటీని పైకి తీసుకొచ్చేలా ఇంట్లో తల్లి కొన్ని పనులు చేయాల్సి ఉంటుందని స్నేహా రెడ్డి చెప్పుకొచ్చారు.
ఇందు కోసం ఆమె ఆరు పాయింట్లను మెయిన్‌గా చెప్పుకొచ్చారు.పిల్లల్ని ఎప్పుడూ మోటివేట్ చేస్తుండాలి.క్రియేటివ్‌గా ఆలోచించేలా చేయాలి.
వారంలో పిల్లలు ఏ ఏ పనులు చేయాలో ముందే ఒక లిస్ట్ ప్రకారం రాసి షెడ్యూల్ వేసి పెట్టుకోవాలి.ఎప్పుడూ ఇంట్లోనే కాకుండా.
బయట తిరగనివ్వాలి.ప్రకృతిని ఆస్వాధించేలా చేయాలి.
సూర్య రశ్మి ఒంటి మీద పడేలా చేయాలి.వారి ఊహా శక్తిని పెంపోదించేలా ఆర్ట్స్‌ను నేర్పించాలి.
ఇతర ప్రాణుల పట్ల జాలి, దయ ఉండాలనే విధంగా పెంచాలి.ముఖ్యంగా తల్లులు తమ కోసం తాము టైం కేటాయించుకోవాలి.
అని చెప్పుకొచ్చింది స్నేహా రెడ్డి.ఇక స్నేహా రెడ్డి షేర్ చేసిన ఈ వీడియోలో అల్లు అర్హ, అయాన్‌ల క్రియేటివిటీ కనిపిస్తోంది.
అర్హ తన ముద్దు ముద్దు చేతుల్తో వేసిన బొమ్మలు కనిపిస్తున్నాయి.అయాన్ ఫుట్ బాల్ ఆడుతున్న విజువల్స్ కనిపిస్తున్నాయి.
ఇక అర్హ అయితే కింద పడిన పూలను ఏరుకుంటూ కనిపిస్తోంది.అలా ఆడుకోవడానికి కూడా టైం కేటాయించాలంటూ పిల్లల్ని పెంచే విధానంపై చిన్న చిన్న టిప్స్ ఇచ్చింది స్నేహా రెడ్డి.