ఒక ప్రమాదం ఒక కుటుంబాన్ని రోడ్డు మీద పడేస్తుందనే చెప్పాలి.ఎందుకంటే ఒక యాక్సిడెంట్ అనేది మనిషిని నిస్సహాయుడిని చేస్తుంది.
ఇక దీని బారిన పడితే జీవితాలే కకా వికలం అవుతుంటాయి.ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా సరే రోడ్డుపై నుంచి ఏ వాహనం ఎలా వచ్చి ఢీ కొంటుందో ఎవరికీ తెలియదు.
అందుకే డ్రైవింగ్ చేసే ప్రతిసారీ ట్రాఫిక్ రూల్స్‌ను ఖచ్చితంగా పాటించాలని ఎన్నో రకాలుగా అవగాహన కల్పిస్తూ ఉన్నా కూడా చాలామంది నిర్లక్ష్యంగానే ప్రయాణాలు చేయడాన్ని మనం చూడొచ్చు.
నిజానికి ట్రాఫిక్ రూల్స్‌ను పాటిస్తే ఎలాంటి ప్రమాదాలు జరగవనే చెప్పాలి.
కానీ ఈ విషయాన్ని ఏ ఒక్కరూ కూడా పట్టించుకోవట్లేదు.మనం డ్రైవింగ్ చేసే టప్పుడు ఒక్క సెకన్ నిర్లక్ష్యం చేసినా కూడా జీవితమే తలకిందులు అవుతుందనే చెప్పాలి.
ఇక ఇప్పుడు కూడా ఇలాంటి నిర్లక్ష్యం వల్ల ఎలాంటి ప్రమాదం జరుగుతుందో తెలుస్తోంది.ప్రస్తుత వీడియోలో రాంగ్ రూటులో వెల్తున్న మహిళలు ఇద్దరు బైక్‌పై వచ్చి చివరకు కాళ్లు విరగ్గొట్టుకున్న ఘటనలను మనం చూడొచ్చు.
ఈ ఘటన ఏపీలోని అనంతపురం జిల్లాలో జరిగింది.
పట్టణంలోని టవర్ క్లాక్ రద్దీగా ఉండే రోడ్డు దగ్గర ఆర్టీసీ బస్సు ఈ ఇద్దరు మహిలలు వెళ్తున్న బైక్ పడి చివరకు తీవ్రంగా గాయపడ్డారు.అయితే అక్కడే డ్యూటీలో ఉండే పోలీసులు గాయపడ్డ మహిళలు ప్రభుత్వాసుపత్రికి తరలించడంతో చికిత్స అందిస్తున్నారు డాక్టర్లు.ఇక ఈ యాక్సిడెంట్లకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ట్రాఫిక్ సిగ్నల్ పడటంతో బస్సు ఆగిన విషయాన్ని మహిళలు గమనించకుండా రాంగ్ రూట్లో వచ్చి చివరకు బస్సు కింద పడ్డారని తెలుస్తోంది.ఇక దీన్ని చూసిన వారంతా ఇలాంటి నిర్లక్ష్యం వద్దంటూ కామెంట్లు పెడుతున్నారు.
మరి మీరు కూడా ఓ సారి దీనిపై చూసేయండి.