ఈమద్య కాలంలో తెలుగు సినిమా హీరోల అభిమానులు సోషల్ మీడియాలో చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు.పెద్ద ఎత్తున ట్వీట్స్ చేయడం.
లైక్స్ చేయడం ఇలా ప్రతి విషయంలో కూడా అభిమానులు రికార్డుల కోసం ప్రాకులాడుతున్నారు.తాజాగా మరో సరికొత్త రికార్డును మహేష్ బాబు అభిమానులు దక్కించుకున్నారు.
ట్విట్టర్ లో ఈమద్య కాలంలో సరికొత్త ఆప్షన్ ఒకటి వచ్చింది.స్పేస్ సెషన్ అంటూ క్రియేట్ చేసి ఎంత మంది అయినా అందులో మాట్లాడుకోవచ్చు.
మహేష్ బాబు పుట్టిన రోజు సందర్బంగా అభిమానులు ఆ సరికొత్త ఆప్షన్ ను తీసుకుని మాట్లాడుకున్నారు.ఈ స్పేస్ లో మహేష్ బాబుతో తమకు ఉన్న అనుబంధం మరియు ఆయన పై ఉన్న అభిమానం గురించి చాలా మంది చాలా రకాలుగా మాట్లాడారు.
ఈ కార్యక్రమంలో ముందుగా సితార మాట్లాడగా ఆ తర్వాత మహేష్ బాబు బావ అయిన సుధీర్ బాబు మాట్లాడాడు.ఆ తర్వాత నమ్రత కూడా మాట్లాడారు.
ఇంకా దర్శకులు అనీల్ రావిపూడి, మెహర్ రమేష్ నిర్మాతలు అనీల్ రావిపూడి, రామ్ ఆచంట రచయితలు కోన వెంకట్ గోపీ మోహన్ ఇంకా పలువురు ప్రముఖులు కూడా మాట్లాడారు.వారి అందరి మాటలను వినేందుకు గాను మహేష్ అభిమానులు దాదాపుగా రెండు గంటల పాటు ట్విట్టర్ ను అంటి పెట్టుకుని ఉన్నారు.
మొదటి సారే అయినా కూడా ఏకంగా పాతిక వేల మంది ఆ స్పెస్ లో జాయిన్ అయ్యారు.అంత మంది జాయిన్ అవుతారు అనుకుని ఏ ఒక్కరు అనుకుని ఉండరు.
మొదటి సారే మీటింగ్ లో జాయిన్ అవ్వడం అంటే మామూలు విషయం కాదు.ప్రస్తుతం ట్విట్టర్ లో ఉన్న ఈ కొత్త ఆప్షన్ ను ముందు ముందు ఇతర హీరోల ఫ్యాన్స్ కూడా వాడుకునే అవకాశం ఉంటుంది.కాని మొదటి సారి మహేష్ బాబు అభిమానులు నిర్వహించిన కార్యక్రమానికి ఇంత మంది రావడం అనేది నిజంగా చాలా పెద్ద విషయం అంటూ నిపుణులు చెబుతున్నారు.