టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం నటి వరలక్ష్మి శరత్ కుమార్ క్రేజ్ బాగా పెరిగిపోయింది.చేసిన సినిమాలు తక్కువైనప్పటికీ కూడా.
చేసిన పాత్రలు మాత్రం చాలా స్ట్రాంగ్ పాత్రలు.ఇక ఆ పాత్రలతోనే తెలుగు ప్రేక్షకులను అభిమానులుగా మార్చుకుంది.
ఇక లేడీ విలన్ పాత్రకు ఇప్పుడున్న నటులలో ఈమెను మించిన వాళ్లు ఉండరని చెప్పాలి.అతి తక్కువ సమయంలో తన నటనతో ప్రేక్షకులందరిని ఫిదా చేసింది.
ఇక ఈమె ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీలో నటుడుగా మంచి గుర్తింపు తెచ్చుకున్న శరత్ కుమార్ ముద్దుల కూతురు.శరత్ కుమార్ మొదటి భార్యకు వరలక్ష్మి పుట్టింది.అలా వారసత్వంగా వరలక్ష్మి నటిగా అడుగుపెట్టి ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.తెలుగు, తమిళం, కన్నడం, మలయాళ భాషలలో నటించి మంచి పేరు సంపాదించుకుంది.
తన నటనకు ఉత్తమనటి అవార్డు కూడా సొంతం చేసుకుంది.
2012 తమిళ సినిమాతో తొలిసారిగా సినీ ఇండస్ట్రీకి పరిచయం అయింది.ఆ తర్వాత మలయాళం, కన్నడ ఇండస్ట్రీలో అడుగు పెట్టి.2019లో తెనాలి రామకృష్ణ బీఏ బీఎల్ సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైంది.గతంలో క్రాక్, నాంది సినిమాలో నటించి తన పాత్రలతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసింది.ఇక యశోద సినిమాలో కూడా వరలక్ష్మీ శరత్ కుమార్ నెగటివ్ రోల్ చేసింది.
ఇక్కడ కూడా బాగా మార్కులు సంపాదించుకుంది.
అంతేకాకుండా ఇటీవలే సంక్రాంతి సందర్భంగా విడుదలైన వీరసింహారెడ్డి సినిమాలో మాత్రం బాలకృష్ణ కు పోటీగా నిలిచింది వరలక్ష్మి శరత్ కుమార్.ఈ సినిమాలో తన అద్భుతమైన పర్ఫామెన్స్ తో ఏకంగా విమర్శకులు సైతం ఫిదా అయ్యారు.మొత్తానికి టాలీవుడ్ లో రమ్యకృష్ణ తర్వాత లేడీ విలన్ గా మెప్పించింది అంటే అది వరలక్ష్మి శరత్ కుమార్ అనే చెప్పాలి.
ఈమె సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది.తెలుగు ప్రేక్షకులను కూడా తన ఫాలోవర్స్ గా మార్చుకుంది.అప్పుడప్పుడు తన డాన్స్ వీడియోలతో కూడా బాగా ఫిదా చేస్తుంది.పొట్టి పొట్టి బట్టలు వేస్తూ అందరిని బాగా ఆకట్టుకుంటుంది.నిజానికి ఈ బ్యూటీ హీరోయిన్ పీస్ అని చెప్పాలి.కానీ టాలీవుడ్ లో ఈమె మొత్తం విలన్ పాత్రలలోనే నటిస్తుంది.
ఇదంతా పక్కన పెడితే తాజాగా తన ఇన్స్టా వేదికగా ఒక స్టోరీ పంచుకుంది.అందులో తను కారులో కూర్చొని ప్రయాణిస్తున్నట్లు కనిపించింది.అయితే తన ముఖానికి ఎండ కొడుతూ ఉండగా.ఆ ఫోటో షేర్ చేస్తూ.
సన్ కిస్డ్ అంటూ పంచుకుంది.అంటే తనను సూర్యుడు ముద్దాడుతున్నాడు అన్నట్లుగా తెలిపింది.
ప్రస్తుతం ఆ స్టోరీ బాగా వైరల్ అవ్వగా.మిమ్మల్ని ముట్టుకోవడానికి సూర్యుడికి అంత ధైర్యం ఎలా వచ్చింది అంటూ.
ఆమె నెగటివ్ రోల్స్ ను ఉద్దేశించి కామెంట్లు పెడుతున్నారు.ప్రస్తుతం ఆమె వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంది.