టాలీవుడ్ స్టార్ హీరోలలో జూనియర్ ఎన్టీఆర్ ఎంతో ప్రత్యేకమనే సంగతి తెలిసిందే.తన నటనతో ఎన్టీఆర్ ఎన్నో విజయాలను సొంతం చేసు కోవడంతో పాటు ప్రశంసలు అందుకున్నారు.
తాజాగా బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనే జూనియర్ ఎన్టీఆర్ తో నటించాలని ఉందని వెల్లడించగా ఆ కామెంట్స్ వైరల్ అయ్యాయి.అయితే దీపికా పదుకొనే చేసిన కామెంట్ల గురించి నటి పాయల్ ఘోష్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఊసరవెల్లి సినిమాలో తమన్నా ఫ్రెండ్ పాత్రలో నటించిన పాయల్ ఘోష్ దీపికా పదుకొనే తారక్ విషయంలో చేసిన కామెంట్ల గురించి ఆనందం వ్యక్తం చేశారు. జూనియర్ ఎన్టీఆర్ మంచి మనిషి అని గ్లోబల్ స్టార్ అని పాయల్ ఘోష్ అభిప్రాయం వ్యక్తం చేశారు.
గతంలోనే తారక్ నటన గురించి తాను పాజిటివ్ గా మాట్లాడానని అయితే ఆ సమయంలో కొంత మంది తనపై విమర్శలు చేశారని పాయల్ ఘోష్ వెల్లడించారు.
తాను తారక్ గురించి మళ్లీ ఇప్పుడు చెబుతున్నానని ఆయన ఆల్ రౌండర్ స్టార్ అని తాను మొదటినుంచి ఇదే విషయం చెబుతున్నానని పాయల్ చెప్పుకొచ్చారు.
తనకు తారక్ సత్తా గురించి తెలుసని త్వరలో తారక్ సత్తా ప్రపంచానికి కూడా తెలుస్తుందని ఆమె అన్నారు.టాలీవుడ్ ఇండస్ట్రీ భవిష్యత్తులో బాలీవుడ్ ఇండస్ట్రీని మించిపోతుందని పాయల్ ఘోష్ అభిప్రాయం వ్యక్తం చేశారు.
పాయల్ ఘోష్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు.పాయల్ కామెంట్లు ఎన్టీఆర్ అభిమానులకు చాలా సంతోషాన్ని కలిగిస్తున్నాయి. బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ తారక్ కొరటాల శివ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు.బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు తారక్ కు జోడీగా నటించడానికి తెగ ఆసక్తి చూపిస్తుండటం గమనార్హం.
తారక్ నటించిన ఆర్ఆర్ఆర్ మూవీ త్వరలో థియేటర్లలో రిలీజ్ కానుంది.