ప్రముఖ టాలీవుడ్ నటి లతాశ్రీ( Lathasri ) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.సోషల్ మీడియా( Social media )లో యాక్టివ్ గా ఉంటే ఈ నటి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ విషయాలను వెల్లడించారు.
ఊటీలో నేను, మహేష్ బాబు ఐస్ క్రీమ్ తినడానికి వెళ్లేవాళ్లమని ఆమె వెల్లడించారు.ఈ మధ్య కాలంలో ఏదో ఫంక్షన్ లో మహేష్ బాబును కలిశానని ఆమె పేర్కొన్నారు.
మహేష్ బాబు చాలా బాగా మాట్లాడారని మహేష్ చాలా మంచి మనిషని ఫ్రెండ్లీ నేచర్ అని లతాశ్రీ వెల్లడించారు.
నేను కృష్ణ గారి మేనకోడలినని ఆమె చెప్పుకొచ్చారు.నన్ను కృష్ణ కుటుంబం చాలా బాగా చూసుకునేవారని లతాశ్రీ అన్నారు.కృష్ణ గారి కాంబినేషన్ లో చాలా సినిమాలు చేశానని లతాశ్రీ చెప్పుకొచ్చారు.
ఊటీకి సాంగ్ కోసం 3 రోజులు వెళ్లామని ఆమె కామెంట్లు చేశారు.ఈ మధ్య కాలంలో ఏ సినిమాకు సైన్ చేయలేదని ఆమె పేర్కొన్నారు.
మహేష్ కు సంబంధించి ఒక మూవీలో ఛాన్స్ వచ్చినా కొన్ని కారణాల వల్ల వదులుకున్నానని లతాశ్రీ అన్నారు.
క్యారెక్టర్లు నచ్చక కొన్ని సినిమాలు వదిలేసిన రోజులు ఉన్నాయని ఆమె కామెంట్లు చేశారు.కెరీర్ తొలినాళ్లలో కొన్ని సినిమాలలో నటించడానికి ఇబ్బందులు పడ్డానని ఆమె తెలిపారు. ఎస్వీ కృష్ణారెడ్డి, ఇ.వి.వి.సత్యనారాయణ( Sv Krishna Reddy ) డైరెక్షన్ లో తెరకెక్కిన ఎక్కువ సినిమాల్లో చేశానని లతాశ్రీ పేర్కొన్నారు.లతాశ్రీ కెరీర్ పరంగా మరింత సక్సెస్ సాధించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.లతాశ్రీని అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.90లలో బిజీగా ఉన్న ఈ ఆర్టిస్ట్ ఎక్కువగా చెల్లి పాత్రలో నటించి మెప్పించారు.మేజర్ చంద్రకాంత్ లో ఎన్టీఆర్ కూతురిగా నేను చేయాలి కానీ కొన్ని రీజన్స్ వల్ల ఆ రోల్ మిస్సైందని పేర్కొన్నారు.నాకు ఇండస్ట్రీలో డబ్బులు ఎగ్గొట్టిన వాళ్లు ఎక్కువని లతాశ్రీ అన్నారు.
లతాశ్రీ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.