వీకే నరేష్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.వీకే నరేష్( VK Naresh ) నటి ఒకప్పటి హీరోయిన్ విజయనిర్మల కొడుకు అన్న విషయం అందరికీ తెలిసిందే.
సినిమాల్లో హీరోగా కమెడియన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నారు.ఇప్పటికీ సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్న విషయం తెలిసిందే.
మొన్నటి వరకు నటి పవిత్ర లోకేష్( Actress Pavitra Lokesh ) విషయంలో నరేష్ పేరు సోషల్ మీడియాలో మారుమోగిపోయింది.సినిమాల విషయాలకంటే ఎక్కువగా పెళ్లిళ్ల విషయంలోనే నరేష్ హైలెట్ అవుతూ వచ్చారు.
ఇక పవిత్ర లోకేష్, నరేష్ ఒక్కటి కావడంతో ప్రస్తుతం ఎవరి పనుల్లో వాళ్లు బిజీగా ఉన్నారు.
సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా పవిత్ర లోకేష్, నరేష్ బిజి బిజిగా ఉన్నారు.వరుస సినిమాలతో ఈ జంట దూసుకుపోతుంది.ఇక నరేష్ ఇటీవల 50 సంవత్సరాల తన సినీ కెరియర్ పూర్తి చేసుకున్నారు.
ఈ క్రమంలోనే ఆయన ఒక ఇంటర్వ్యూలో పాల్గొని… ఆయన గురించి, తన ఫ్యామిలీ గురించి ఆసక్తికరవ్యాఖ్యలు చేశారు.నరేష్ ఈ ఇంటర్వ్యూలో మహేశ్ బాబు( Mahesh Babu ) గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు.
ముఖ్యంగా కృష్ణ విజయం నిర్మల మరణించిన తర్వాత తమ జీవితాల గురించి నరేష్ షాకింగ్ కామెంట్స్ చేశారు.చిన్నప్పుడు నేను మహేష్ అందరూ కూడా బాగా కలిసి ఉండే వాళ్ళం.
కృష్ణ గారు అమ్మ విజయనిర్మల( Vijaya Nirmala ) వెళ్లిపోయిన తర్వాత ఎవరి లైఫ్ వాళ్ళది అయింది.కుటుంబంలో అందరికంటే పెద్దవాడిగా నేనున్నానని తమ ఫ్యామిలీపై ఈగ వాలకుండ చూసుకొనే బాధ్యత తనదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు నరేష్.ఒక్క మహేశ్ ఫ్యామిలీకే కాదు.అందరికీ నేను అండగా ఉంటానని యానిమల్ సినిమాలోని డైలాగ్ తరహాలో చెప్పుకువచ్చారు నరేష్.ఈ సందర్భంగా నరేష్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.కృష్ణ వారసత్వాన్ని పునికిపుచ్చుకున్న మహేష్ తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకున్నాడంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.