2024 ఎన్నికల్లో ఏపీలో ఆ పార్టీదే విజయం.. సుమన్ సంచలన వ్యాఖ్యలు వైరల్!

ఏపీలో 2024 ఎన్నికలకు మరో 9 నెలల సమయం మాత్రమే ఉంది.ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో అన్ని రాజకీయ పార్టీలు తమదైన శైలిలో వ్యూహాలను రచిస్తున్నాయి.అయితే ప్రముఖ నటుడు సుమన్( Suman ) ఏపీ రాజకీయాల గురించి మాట్లాడుతూ తనదైన శైలిలో కామెంట్లు చేయగా ఆ కామెంట్లు వైరల్ అవుతున్నాయి.2024 ఎన్నికల్లో ఏపీలో మరోసారి వైసీపీ అధికారంలోకి వస్తుందని ఆయన జోస్యం చెప్పారు.

 Actor Suman Comments About Ycp Details Here Goes Viral , Suman, Navaratnalu , C-TeluguStop.com
Telugu Suman-Movie

2024 ఎన్నికల్లో సైతం జగన్ సీఎం( CM jagan ) అవుతారని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.ఏపీలోని ఇతర పార్టీలకు పొత్తుల విషయంలో స్పష్టత లేదని ఆయన చెప్పుకొచ్చారు.సీఎం అభ్యర్థి ఎవరో చెప్పలేని స్థితిలో ఇతర పార్టీలు ఉన్నాయని ఆయన కామెంట్లు చేశారు.అన్ని వర్గాల ప్రజలు జగన్ వెంట ఉన్నారని రెడ్డి కమ్యూనిటీలో ఎక్కువమంది జగన్ ను మళ్లీ సీఎం చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారని సుమన్ చెప్పుకొచ్చారు.

దేశ చరిత్రలో ప్రకటించిన మ్యానిఫెస్టోను అమలు చేసిన ఏకైక సీఎం జగన్ మాత్రమేనని సుమన్ కామెంట్లు చేశారు. నవరత్నాలలో( Navaratnalu ) 95 శాతం పథకాలను ఆయన అమలు చేశారని సుమన్ చెప్పుకొచ్చారు.

కరోనా సమయంలో సైతం సీఎం జగన్ పేదలను ఇబ్బందులు పెట్టకుండా పథకాలను అమలు చేశారని ఆయన కామెంట్లు చేశారు.అన్ని వర్గాలకు, కులాలకు సమ న్యాయం చేశానని జగన్ కామెంట్లు చేశారు.

Telugu Suman-Movie

సీఎం జగన్ 2024 ఎన్నికల్లో అనుకూల ఫలితాలను సొంతం చేసుకుంటారో వ్యతిరేక ఫలితాలను సొంతం చేసుకుంటారో చూడాల్సి ఉంది.ఏపీలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుండగా ఆ ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది.హీరో సుమన్ విషయానికి వస్తే సుమన్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా సినిమాలతో బిజీగా ఉన్నారు.సుమన్ వివాదాలకు దూరంగా ఉంటూ వరుసగా సినిమా ఆఫర్లతో కెరీర్ పరంగా బిజీగా ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube