తండ్రి ఆపరేషన్ కోసం బాధపడుతున్న యువకుడిని సోనూసూద్ భరోసా.. గ్రేట్ అంటూ?

ప్రముఖ టాలీవుడ్( Tollywood ) నటుడు, విలన్ కరోనా సమయంలో చేసిన సేవా కార్యక్రమాల గురించి ఎంత చెప్పినా తక్కువేననే సంగతి తెలిసిందే.సోనూసూద్( Sonusood ) ఎంతోమంది ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు.

 Actor Sonusood Assures A Young Man Who Is Worried About His Fathers Heart Opera-TeluguStop.com

కోట్ల రూపాయల సహాయం చేసి మంచి పేరును సంపాదించుకున్నారు.సోనూసూద్ రాజకీయాల్లోకి వస్తే సక్సెస్ సాధించడంతో పాటు మరిన్ని సంచలన విజయాలను ఖాతాలో వేసుకునే ఛాన్స్ అయితే ఉంది.

మంచితనమే సోనూసూద్ పాలిట శాపమైందని కరోనా తర్వాత తెలుగు సినిమాలలో సోనూసూద్ కు ఆఫర్లు తగ్గాయని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు.సోనూసూద్ కు ఇతర భాషల్లో సైతం గతంలోలా మూవీ ఆఫర్లు అయితే రావడం లేదు.

అయితే తాజాగా సోనూసూద్ తండ్రి ఆపరేషన్ కోసం బాధపడుతున్న యువకుడికి భరోసా ఇచ్చారు.మీ నాన్నకు గుండె ఆపరేషన్ చేయించి కాపాడతానని సోనూసూద్ చెప్పుకొచ్చారు.

Telugu Deoria, Pallav Singh, Programs, Sonusood, Tollywood-Movie

యూపీలోని డియోరియాకు( Deoria in UP ) చెందిన పల్లవ్ సింగ్ ( Pallav Singh )అనే వ్యక్తి తన తండ్రి గుండె కేవలం 20 శాతం మాత్రమే పని చేస్తోందని తండ్రి బ్రతకాలంటే ఆపరేషన్ అవసరమని పూర్తి వివరాలతో పోస్ట్ పెట్టారు.ఈ పోస్ట్ చూసి సోనూసూద్ స్పందించారు.“మేము మీ తండ్రిని చనిపోనివ్వము సోదరా.నా పర్సనల్ ట్విట్టర్ ఐడీ ఇన్ బాక్స్ కు డైరెక్ట్ గా మీ నంబర్ పోస్ట్ చేయండి.

దయచేసి ట్వీట్ లో పోస్ట్ చేయవద్దు” అని సోనూసూద్ కామెంట్ చేశారు.

Telugu Deoria, Pallav Singh, Programs, Sonusood, Tollywood-Movie

సోనూసూద్ ట్వీట్ కు 9,200కు పైగా లైక్స్ వచ్చాయి.సోనూసూద్ రాబోయే రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలను నిర్వహించి ప్రజలకు మరింత దగ్గరవ్వాలని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.పాన్ ఇండియా ప్రాజెక్ట్ లలో సోనూసూద్ భాగమైతే బాగుంటుందని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.

సోనూసూద్ నిజంగా గ్రేట్ అంటూ నెటిజన్ల నుంచి సోషల్ మీడియా వేదికగా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube