ప్రధాన నూనె గింజల పంటలలో వేరుశనగ పంట( Groundnut crop ) కూడా ఒకటి.వేరుశెనగ పంటకు మార్కెట్లో ఎప్పుడు మంచి డిమాండే ఉంటుంది.
కానీ ఈ పంటకు చీడపీడల, తెగుళ్ల బెడద కాస్త ఎక్కువ.కాబట్టి వేరుశనగ పంట సాగు విధానంపై పూర్తి అవగాహన వచ్చిన తర్వాతనే సాగు చేస్తే ఆశించిన స్థాయిలో అధిక దిగుబడులు సాధించవచ్చు.
వేరుశనగ పంటకు తీవ్ర నష్టం కలిగించే తెగుళ్లలో మొగ్గ కుళ్ళు వైరస్ కూడా ఒకటి.ఈ వైరస్ రాకుండా ముందుగా సంరక్షక చర్యలు చేయాలి లేకపోతే సోకిన తొలి దశలోనే నివారించాలి.
వేరుశనగ మొక్క ఆకులపై తేలికపాటి రంగు( Light color on leaves ) మారిపోయిన మచ్చలు ఏర్పడతాయి.ఆ తర్వాత ఈ మచ్చలు పూర్తిగా రంగు మారిపోయి నిర్జీవమైన రింగుల వలె చారికలుగా మారిపోతాయి.ఇక మొక్కల మొగ్గలు, కాండాలు, ఆకుకాండాలకు సోకుతుంది.ఆ తరువాత మొగ్గలు కుళ్ళిపోయి చనిపోతాయి.ఉష్ణోగ్రతల వల్ల కూడా ఈ తెగులు వ్యాప్తి చెందే అవకాశం ఉంది.తొలి దశలో ఈ తెగుళ్లను అరికట్టకపోతే సగానికి పైగా దిగుబడి తగ్గే అవకాశం ఉంటుంది.
పంటకు ఈ మొగ్గకుళ్ళు వైరస్ సోకకుండా ముందస్తు చర్యలలో భాగంగా.తెగులు నిరోధక విత్తనాలను( Pest resistant seeds ) ఎంపిక చేసుకుని సాగు చేపట్టాలి.
పంట త్వరగా వేయడం వల్ల ఈ వైరస్ సోకే అవకాశం ఉండదు.మొక్కజొన్న లేదా సజ్జలు అంతర పంటలుగా వేరుశనగ పంటలో వేయడం వల్ల ఇది వ్యాపించకుండా నియంత్రించవచ్చు.
మినుములు లేదా పెసలు లాంటి మొక్కలను వేరుశెనగ పంటకు దగ్గరగా సాగు చేయకూడదు.పొలంలో కలుపు మొక్కలు లేకుండా ఎప్పటికప్పుడు పీకేయాలి.తెగుళ్ల లక్షణాలు కనిపిస్తే ఆ మొక్కల అవశేషాల్ని పూర్తిగా తొలగించేయాలి.సేంద్రీయ పద్ధతిలో ఈ మొగ్గ కుళ్ళు వైరస్ నియంత్రించాలి అనుకుంటే పంట వేసిన 20 రోజుల తర్వాత జొన్న లేదా కొబ్బరి ఆకుల సారాన్ని పిచికారి చేయాలి.
రసాయన పద్ధతిలో ఈ మొగ్గ కుళ్ళు వైరస్లు నియంత్రించాలి అనుకుంటే పంట వేసిన 30 రోజుల తర్వాత డైమిథోనేట్ లాంటి కీటక నాశులను పొలంలో చల్లటం వల్ల మొగ్గ కుళ్ళు తెగుళ్లు అరికట్టవచ్చు.