వేసవికాలంలో ఎండలో పుచ్చకాయ ముక్కలను తింటే ఆ అనుభూతే వేరు.పుచ్చకాయ ముక్కలను తినటం వలన వేసవిలో కలిగే దాహం బాగా తీరుతుంది.
అయితే మనం పుచ్చకాయ ముక్కలను తిని గింజలను పాడేస్తూ ఉంటాం.అయితే గింజలలో అనేక పోషక విలువలు ఉన్నాయి.
వాటి గురించి తెలిస్తే గింజలను పాడేయకుండా తినటం అలవాటు చేసుకుంటారు.పుచ్చకాయ గింజల్లో విటమిన్స్ తో పాటు మెగ్నీషియం, ఐరన్, పొటాషియం, పాస్పరస్, కాపర్ జింక్, మాంగనీస్ సమృద్ధిగా ఉంటాయి.
ఈ గింజలలో ఉండే అమైనోఆసిడ్స్ రక్త నాళాలను వెడల్పు చేసి రక్త ప్రసరణ బాగా జరిగేలా చేసి గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది.అంతేకాక రోగనిరోధక శక్తిని పెంచటానికి కూడా దోహదం చేస్తుంది.
ఈ గింజలలో ఐరన్ సమృద్ధిగా ఉండుట వలన శరీరంలో క్యాలరీలను శక్తిగా మార్చటంలో సహాయపడుతుంది.
మోనోసాచ్యురేటెడ్, పాలీ అన్సాచ్యూరేటెడ్ ఫ్యాటీ ఆసిడ్లు సమృద్ధిగా ఉండుట వలన గుండె ఆరోగ్యం బాగుంటుంది.
అలాగే శరీరంలో కొలస్ట్రాల్ నిల్వలు లేకుండా చేయటంలో చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది.
ఈ గింజల్లో ఉండే ప్రొటీన్, అమైనో ఆసిడ్లు శరీరంలో రక్తపోటును తగ్గించటంలో చాలా బాగా సహాయపడతాయి.
పుచ్చకాయ గింజల్లో ఎల్ – సిట్రులిన్ సమృద్ధిగా ఉండుట వలన కండరాలు బలంగా ఉండేందుకు మరియు కండరాల కణజాలాన్ని రిపేర్ చేయటానికి బాగా సహాయపడుతుంది.
ఈ గింజల్లో ఉండే ఫోలేట్ లేదా ఫోలిక్ ఆసిడ్ మెదడు పనితీరులో సహాయపడటమే కాకుండా ఫ్రీ రాడికల్స్ బారి నుండి మెదడును రక్షిస్తుంది.