ప్రమాదం తప్పింది.. తిరిగి మాట్లాడుతున్న బుల్లితెర నటి శ్రీ వాణి!

బుల్లితెర నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి శ్రీవాణి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు ఈమె ఎన్నో బుల్లితెర సీరియల్స్ ద్వారా ప్రేక్షకులను సందడి చేయడమే కాకుండా జబర్దస్త్ కార్యక్రమం ద్వారా కూడా పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేశారు.ఇలా పలు సీరియల్స్ ఈవెంట్స్ ద్వారా అభిమానులను సందడి చేసే ఈమె సొంతంగా యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా నిత్యం ఏదో ఒక వీడియో షేర్ చేస్తూ అభిమానులను ఎంటర్టైన్ చేసేవారు.

 Accident Averted Tv Actress Sri Vani Is Talking Back , Actress Sri Vani ,chandra-TeluguStop.com

నెలరోజుల పాటు శ్రీ వాణి గొంతు మూగబోయిన విషయం మనకు తెలిసిందే.మాట్లాడటానికి కూడా చాలా ఇబ్బందిగా ఉన్నప్పటికీ ఈమె అలాగే కొన్ని వీడియోస్ చేశారు.

ఈ క్రమంలోనే రోజురోజుకు తన మాట స్పష్టంగా రాకపోవడంతో అనుమానం వచ్చిన శ్రీవాణి జూలై 19వ తేదీ హాస్పిటల్ కి వెళ్ళగా తన గొంతులో ఇన్ఫెక్షన్ కారణంగా మాట రాలేదని ఈమె గట్టిగా అరవటం వల్ల ఇలాంటి ఇన్ఫెక్షన్ వచ్చిందని వైద్యులు సూచించినట్లు తన భర్త విక్రమ్ తెలిపారు.నెలరోజుల పాటు శ్రీ వాణి మాట్లాడకుండా ఉంటేనే తిరిగి తన యధావిధిగా మాట్లాడగలరని లేకపోతే జీవితంలో మాట రాదంటూ వైద్యులు చెప్పినట్లు విక్రమ్ వెల్లడించారు.

ఇక డాక్టర్లు సూచించిన విధంగానే నెల రోజులుగా శ్రీవాణి మాట కూడా మాట్లాడకుండా సైగలతో మేనేజ్ చేశారు.ఇలా ఈమెకు గొంతు రాకపోయినా ఎన్నో వీడియోలు ద్వారా అభిమానుల ముందుకు వచ్చారు.ఇకపోతే ఆగస్టు 19వ తేదీ శ్రీ వాణి మరోసారి హాస్పిటల్ కి వెళ్ళగా పరీక్షించిన వైద్యులు తన ఇన్ఫెక్షన్ పూర్తిగా తగ్గిందని యధావిధిగా తను మాట్లాడవచ్చు అంటూ చెప్పడంతో ఈమె ఏకంగా తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ విషయాన్ని తెలియజేస్తూ తనకు పూర్తిగా నయం అయిందని, నాకోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అంటూ తెలియజేశారు.ఇకపై ఎవరికైనా ఇలాంటి సమస్య వస్తే తనలా ఆశ్రద్ధ చేయవద్దని వెంటనే డాక్టర్లను సంప్రదించమని ఈ సందర్భంగా శ్రీ వాణి అందరికీ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలియజేశారు.

ఏది ఏమైనా తిరిగి ఈమె మాట్లాడటంతో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube