లారీ ఢీకొని యువకుడి దుర్మరణం

సూర్యాపేట జిల్లా:మఠంపల్లి మండలం బక్కమంతులు గూడెం గ్రామ శివారులో మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం చెందాడు.

ద్విచక్ర వాహనాన్ని లారీ వెనుక నుంచి ఢీ కొట్టడంతో ద్విచక్ర వాహనంపై ఉన్న హుజూర్ నగర్ మండలం గోపాలపురం గ్రామానికి చెందిన నందిగామ నరేందర్ (20) అక్కడిక్కడే మృతి చెందాడు.

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని హుజూర్ నగర్ ఏరియా హాస్పిటల్ తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదెక్కడి రోగం... మొబైల్‌లో అరగంటకన్నా ఎక్కువ మాట్లాడితే హై బీపీ వచ్చేస్తోంది?

Latest Nalgonda News