డిక్టేటర్ కి అడ్డంకులు

అనుకున్నదే జరిగింది.బాలయ్య బాబు డిక్టేటర్ చిక్కుల్లో పడింది.

 Distributors Creating Hurdles For Dictator-TeluguStop.com

ఇరు వర్గాల్లో ఎవరో ఒకరు సర్దుకోవాల్సిందే , అటు ఇటు, రెండు చోట్లా మొండితనం చివరకి దాకా కొనసాగితే సినిమా విడుదల వాయిదా పడినా ఆశ్చర్యపోనక్కరలేదు.ఎంతకీ ఏమిటి ఈ కథాకమీషు అనేది తెలుగుకోవాలంటే విషయాన్ని పూర్తిగా చదవండి.

బాలకృష్ణ డిక్టేటర్ కి సంబంధించి బిజినెస్ అగ్రీమెంట్లు నెలన్నర క్రితం నుంచే జరుగుతున్నాయి.బయటి జనాలకి తెలియని విషయం ఏమిటంటే, ఏ డిస్ట్రిబ్యూటర్ కుడా అగ్రీమెంట్లో చెప్పిన మొత్తాన్ని ఒకేసారి నిర్మాతకి చేల్లించడు.

సినిమా టాక్ ని బట్టి అటో ఇటో తగ్గడం జరుగుతూ ఉంటాయి.కాని డిక్టేటర్ ఫలితంపై ముందే ఒక అంచనాకి వచ్చేసినట్టున్నారు, డిక్టేటర్ పంపిణిదారులు.

కొంతమంది అగ్రీమెంట్లో అనుకున్న ఎమౌంట్ ని తగ్గించాల్సిందే అని మొండికేస్తున్నారు, మరికొందరైతే ప్రాజెక్ట్ నుంచి తప్పుకునేందుకు యత్నిస్తున్నారని ఫిలింనగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.శంకరాభరణం ఫ్లాప్ నుంచే పంపిణిదారుల నుంచి ఇదే గళం వినిపిస్తున్నా, గత రెండు రోజులుగా ఇది మరింత గట్టిగా వినిపిస్తోందని టాక్.

సినిమా ట్రైలర్ నచ్చకపోవడంతో వెనకడుగువేస్తున్నారా, లేకా పబ్లిక్లో కోన వెంకట్ మీద పెరిగిన అసహనం వల్ల తగ్గుతున్నారా తెలియదు కాని, అయితే పంపిణిదారులైనా వెనక్కితగ్గాలి, లేదంటే నిర్మాతలైనా సర్దుకుపోవాలి.అందరూ ఇలానే మొండిగా ఉంటే, డిక్టేటర్ సంక్రాంతి రేసు తప్పుకుంది అనే ప్రకటన మనమందరం వినడానికి సిద్ధం కావాల్సిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube