పూరి జగన్నాథ్ కి బాలివుడ్ లో సన్నిహితులు ఎక్కువ.అందుకే ఆయన హీరోయిన్లు ఎక్కువగా ఉత్తరాదివారు అయ్యి ఉంటారు.
బద్రిలోని అమీషా పటేల్ నుంచి, కొత్తగా వచ్చిన లోఫర్ లో దిశా పటాని దాకా, పూరి సినిమాల్లో ఎక్కువగా మనకు కనిపించింది హిందీ భామలే.మధ్యలో త్రిష,అసిన్ వంటి అగ్ర కథానాయికలను మినహాయిస్తే, పూరి ముంబాయి మోడల్స్ కే అధిక ప్రాధాన్యం ఇస్తాడు.
ఇటివలే విడుదలైన హేట్ స్టోరి 3 చూసే ఉంటారు.సల్మాన్ ఖాన్ వీర్ లో తెరంగ్రేటం చేసి, ఫ్లాపులతో సతమతమై, చివరకి హేట్ స్టోరి లాంటి బూతు సినిమాతో విజయాన్ని సొంతం చేసుకుంది జరీన్ ఖాన్.
ఈ ఒక్క సినిమాకి ముందు జరీన్ ఇమేజ్ వేరు, హద్దులు దాటడం పక్కన పెడితే సరిగ్గా ఎక్పోజింగ్ కుడా చేయలేదు ఈ బ్యూటి.కాని హేట్ స్టోరి 3 లో మాత్రం రెచ్చిపోయింది.
విచ్చలవిడిగా అందాలు ఆరబోసింది.దాంతో ఏ భామ వైపు మళ్ళి చూస్తున్నారు దర్శక నిర్మాతలు.
మన పూరి జగన్నాథ్ కుడా ఇదిగో ఈ అమ్మడితో హోటల్ లో చర్చలు జరుపుతూ కెమెరా కంటికి చిక్కాడు.ఎదో ఫ్రెండ్లీ గా కలిసారో లేక ఏదైనా సినిమా గురించి కలిసారో తెలియదు.
బహుశా ఈ హాట్ బ్యుటిని తెలుగులో పరిచయం చేసేందుకు యత్నాలు చేస్తున్నాడేమో పూరి.








