ప్రభుత్వ ఇంటి స్థలాలు అన్యాక్రాంతం కాకుండా కాపాడాలి:సిపిఎం

యాదాద్రి భువనగిరి జిల్లా: రామన్నపేట మండలం దుబ్బాక గ్రామంలో గతంలో పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలు అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకొని,అక్రమ కట్టడాలను(Illegal constructions) నిరోధించాలని సిపిఎం రామన్నపేట మండల కమిటీ సభ్యులు మేడి గణేష్(Madi Ganesh),శాఖ కార్యదర్శి గుండాల ప్రసాద్(Gundala Prasad) అన్నారు.సిపిఎం ఆధ్వర్యంలో ఎంపీఓకు వినతిపత్రం అందజేశారు.

 Govt House Sites Should Be Protected From Alienation-cpm, Govt House, Yadadri Bh-TeluguStop.com

అనంతరం వారు మాట్లాడుతూ స్థానిక సుందరయ్య కాలనీలో పేదలకు పంచగా మిగిలిన ప్రభుత్వ స్థలాల్లో కొంతమంది అక్రమంగా ఇంటి నిర్మాణాలు చేపడుతున్నా అధికారులు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని,ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ఆక్రమణకు గురవుతున్న ప్రభుత్వ స్థలాలను కాపాడి, అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని,లేనిపక్షంలో సిపీఎం(CPM) ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో సిపిఎం గ్రామశాఖ నాయకులు గుండాల సుందర్, గుండాల నరేష్, మత్స్యగిరి తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube