ప్రభుత్వ ఇంటి స్థలాలు అన్యాక్రాంతం కాకుండా కాపాడాలి:సిపిఎం

యాదాద్రి భువనగిరి జిల్లా: రామన్నపేట మండలం దుబ్బాక గ్రామంలో గతంలో పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలు అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకొని,అక్రమ కట్టడాలను(Illegal Constructions) నిరోధించాలని సిపిఎం రామన్నపేట మండల కమిటీ సభ్యులు మేడి గణేష్(Madi Ganesh),శాఖ కార్యదర్శి గుండాల ప్రసాద్(Gundala Prasad) అన్నారు.

సిపిఎం ఆధ్వర్యంలో ఎంపీఓకు వినతిపత్రం అందజేశారు.అనంతరం వారు మాట్లాడుతూ స్థానిక సుందరయ్య కాలనీలో పేదలకు పంచగా మిగిలిన ప్రభుత్వ స్థలాల్లో కొంతమంది అక్రమంగా ఇంటి నిర్మాణాలు చేపడుతున్నా అధికారులు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని,ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ఆక్రమణకు గురవుతున్న ప్రభుత్వ స్థలాలను కాపాడి, అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని,లేనిపక్షంలో సిపీఎం(CPM) ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో సిపిఎం గ్రామశాఖ నాయకులు గుండాల సుందర్, గుండాల నరేష్, మత్స్యగిరి తదితరులు పాల్గొన్నారు.

పబ్లిక్ లో కుటుంబం ముందే యువకుడిని కొట్టి హతమార్చిన గ్యాంగ్..(వీడియో)