లడ్డూ వివాదం : జగన్ కు  చంద్రబాబు వార్నింగ్ 

తిరుమల లడ్డు వివాదం రోజురోజుకు ముదురుతోంది.  ముఖ్యంగా ఈ విషయంలో వైసీపీని ( YCP )టార్గెట్ చేసుకుని టిడిపి అధినేత , ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు,  ఆ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తుండగా, వైసీపీ కూడా అంతే స్థాయిలో రియాక్ట్ అవుతోంది.

 Chandrababu Warning To Jagan On Laddu Controversy, Tirumala Laddu Issue, Jagan,-TeluguStop.com

ఈ వివాదం రోజురోజుకు మరింతగా ముదురుతున్నట్టుగానే కనిపిస్తుంది .తాజాగా తిరుమల లడ్డు వ్యవహారంపై టిడిపి అధినేత చంద్రబాబు ,జగన్ ( Chandrababu, Jagan )ను టార్గెట్ చేసుకుని విమర్శలు చేశారు.‘ వైఎస్  జగన్మోహన్ రెడ్డి దేవుడిని దర్శించుకోవచ్చు అని , అయితే ఆయనకు వెంకటేశ్వర స్వామి పై నమ్మకం ఉందా లేదా అనేది ముఖ్యమని,  నమ్మకం ఉంటే అన్యమతస్తులు సాంప్రదాయం ప్రకారం డిక్లరేషన్ ఇవ్వాలని చంద్రబాబు అన్నారు.డిక్లరేషన్ ఇవ్వాల్సిన బాధ్యత నీకు లేదా ? ఆ సాంప్రదాయాన్ని గౌరవించకపోతే నువ్వు తిరుమల ఎందుకు వెళ్లాలి ?  మీకు అధికారం ఇచ్చింది ముఖ్యమంత్రిగా కానీ,  సాంప్రదాయాలకు విరుద్ధంగా పనిచేయమని కాదు .అది అడిగితే బూతులు తిట్టారు అని చంద్రబాబు మండిపడ్డారు .

ఆంజనేయస్వామికి చెయ్యి నరికేస్తే ఏమవుతుంది బొమ్మ కదా అని వైసిపి వాళ్ళు అన్నారని చంద్రబాబు గుర్తు చేశారు.  హనుమంతుడు బొమ్మ,  వెంకటేశ్వర స్వామి బొమ్మ , రాములవారి తల తీసేస్తే ఏముంది ఇంకో విగ్రహం పెట్టుకోవచ్చు కదా అన్నారని చంద్రబాబు గుర్తు చేశారు.  రధం కాలిపోతే ఏముంది తేనెటీగలు వచ్చాయి అన్నారు .తిరుమల పోటు లో అగ్నిప్రమాదం జరిగితే ఏమవుతుంది అని అడిగారు.  ఇలా నిర్లక్ష్యంగా ప్రవర్తించి భక్తుల మనోభావాలను దెబ్బతీశారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.

  అందుకే బాధపడుతూ చెబుతున్నానని , మనం అందరం ఉండి కూడా భగవంతుడికి ఇలా అపరాధం జరిగిందనేది మన బాధని అన్నారు.

అందుకే భగవంతుడికి అందరం క్షమాపణలు చెప్పాలని కోరారు.  ఇక భగవంతుడే చూసుకుంటాడు.  అది వేరే విషయం.

  ఏ మతమైనా సరే కానీ వేరే వారిని చులకనగా చూడడం కరెక్ట్ కాదు.  అపచారం చేసి ఆ అబద్దాలను నిజాలు చేయాలని చూడడం స్వామి ద్రోహం అంటూ చంద్రబాబు జగన్ పై విమర్శలకు దిగారు.

https://twitter.com/ncbn/status/1838428384038187287
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube