తెలుగు సినిమా ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీకి( Akkineni family ) ఉన్న గుర్తింపు మరే ఫ్యామిలీకి లేదని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ ఉన్నన్ని రోజులు వాళ్ళ ఫ్యామిలీ పేరు గుర్తుండి పోతుంది.
ముఖ్యంగా నాగేశ్వరరావు, ఎన్టీఆర్( Nageswara Rao, NTR ) తో కలిసి ఇండస్ట్రీకి ఎన్నో సేవలను అందించారు.ఇక ఎన్టీయార్, ఏ ఎన్నార్ ఇద్దరు ఇండస్ట్రీ కి కండ్లుగా అభివర్ణిస్తూ ఉంటారు.
ఇలాంటి సందర్భంలో అక్కినేని ఫ్యామిలీ నుంచి మూడోతరం హీరోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అఖిల్ మాత్రం ఇండస్ట్రీ వచ్చి తొమ్మిది సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఇప్పటివరకు ఒక్కటి కూడా సరైన సక్సెస్ కూడా సాధించలేదు.కారణం ఏంటి అనేది పక్కన పెడితే ఆయన సినిమాను సెలెక్షన్ లో మాత్రం చాలా వరకు మిస్టేక్స్ అయితే చేస్తున్నారు.
అందుకోసమే ఇప్పుడు నాగార్జున బరిలోకి దిగి కొంతమంది డైరెక్టర్లను లైన్ లో పెట్టినట్టుగా తెలుస్తుంది ఇక గతంలో సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో అఖిల్ హీరోగా చేసిన ఏజెంట్ సినిమా ప్రేక్షకులు ఆశించిన మేరకు విజయనైతే అందించలేకపోయింది.కాబట్టి ఇప్పుడు తమిళ్ డైరెక్టర్ ఆయన లింగు స్వామితో( Lingu Swami ) సినిమా చేయాలనే ఆలోచనలో అఖిల్ ఉన్నట్టుగా తెలుస్తుంది.లింగస్వామి గతంలో ఎనర్జిటిక్ స్టార్ హీరో రామ్ తో వారియర్ అనే సినిమా చేశాడు .ఈ సినిమా ఆశించిన విజయాన్ని దక్కించుకోలేదు.
కానీ అఖిల్( Akhil ) కి చెప్పిన కథ మాత్రం చాలా బాగుందట.అందువల్లే నాగార్జున కూడా ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది.మరి నాగార్జున ముందుండి ఈ సినిమాని నడిపించాలని అనుకుంటున్నాడు.మరి తను అనుకున్నట్టుగానే ఈ సినిమాతో అఖిల్ సూపర్ సక్సెస్ ని సాధించి ఇండస్ట్రీలో మిగతా వారసులతో పాటు తను కూడా స్టార్ హీరో రేస్ లో ఉన్నాడని నిరూపించుకుంటాడా లేదా అనేది తెలియాల్సి ఉంది…
.