ఎల్.ఆర్.ఎస్ దరఖాస్తులను లక్ష్యం మేరకు పూర్తి చేయాలి

రెవెన్యూ అధికారులు, పంచాయతీ కార్యదర్శుల అవగాహన & శిక్షణ కార్యక్రమం లో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా రాజన్న సిరిసిల్ల జిల్లా: ఎల్.ఆర్.

 Lrs Applications Should Be Completed On Target , Lrs Applications, Sandeep Kumar-TeluguStop.com

ఎస్ దరఖాస్తులను లక్ష్యం మేరకు పూర్తి చేయాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు.ఎల్ ఆర్ ఎస్ దరఖాస్తులు, వాటిని ఏ విధానంలో పూర్తి చేయడం, యాప్ లో వివరాల నమోదు పై జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో జిల్లాలోని రెవెన్యూ అధికారులు, సిబ్బందికి శిక్షణ కార్యక్రమాన్ని గురువారం చేపట్టగా, జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీలు, జిల్లాలోని ఆయా గ్రామాల నుంచి మొత్తం కలిపి 42,941 దరఖాస్తులు వచ్చాయని వెల్లడించారు.దరఖాస్తుల  స్క్రూటినీ నిర్దేశిత మార్గదర్శకాల ప్రకారం వచ్చే ఏడాది మార్చి 31వ తేదీలోగా పూర్తి చేయాలని సూచించారు.

 దరఖాస్తులలో అవసరమైన సమాచారాన్ని క్షేత్రస్థాయిలో పర్యటించి సేకరించాలని, జిల్లాలో ఉన్న ఎల్.ఆర్.ఎస్ దరఖాస్తుల ప్రకారం అవసరమైన బృందాలను ఏర్పాటు చేసి వారు వివరాలు సేకరించి, యాప్ లో నమోదు చేయాలని ఆదేశించారు.

సర్వే నెంబర్ వారీగా సంబంధిత రెవెన్యూ గ్రామం/మున్సిపాలిటీలలో  బృందాలు పరిశీలన చేసి జిపిఎస్ ద్వారా సదరు భూమి కో ఆర్డినేట్స్ పక్కాగా నమోదు చేయాలని వివరించారు.

రెగ్యులర్ చేసే భూములు నీటి వనరుల బఫర్ జోన్ , నాలా, చెరువులు , హెరిటేజ్  బిల్డింగ్  పరిధిలోవి కావని ధ్రువీకరించాలని స్పష్టం చేశారు.అన్ని ప్రభుత్వ శాఖల భూముల వివరాలు అందరి వద్ద సమాచారం ఉండాలని స్పష్టం చేశారు.

నీటి వనరులు, కాలువలు చెరువుల ఆక్రమణలకు గురి కాకుండా చూసుకోవాలని అధికారులకు సూచించారు.కలెక్టరేట్, మున్సిపాలిటీల్లో హెల్ప్ డెస్క్ లు ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు.ఇక్కడ డీటీసీపీఓ అన్సారీ, రూరల్ నోడల్ ఆఫీసర్, వీటీడీఏ సీపీఓ రాజ్ కుమార్, సిరిసిల్ల, వేములవాడ మున్సిపల్ కమిషనర్లు మీర్జా ఫసహత్ అలీ బేగ్, రెవెన్యూ అధికారులు, ఎం.పి.ఓ.లు, ఇరిగేషన్ ఏ.ఈ.లు, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube