జర్నలిస్టు లందరికీ ఇళ్ళ స్థలాలు ఇవ్వాలి ఎల్లారెడ్డిపేట జర్నలిస్టుల డిమాండ్.

వేములవాడలో ఆత్మీయ సమావేశాన్ని విజయవంతం చేయాలి.ఐజేయు జిల్లా అధ్యక్షులు దండి సంతోష్ కుమార్.

 The Demand Of Ellareddypet Journalists Is To Give House Sites To All The Journal-TeluguStop.com

రాజన్న సిరిసిల్ల జిల్లా: జగిత్యాల జిల్లా కేంద్రంలో జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోరుతూ చేస్తున్న ఆందోళనకు రాజన్నసిరిసిల్ల జిల్లా యూనియన్ తరపున ఎల్లారెడ్డిపేట మండల జర్నలిస్టులు తమ సంపూర్ణ మద్దతును ప్రకటించారు.ఈ సందర్భంగా ఐజేయు జిల్లా అధ్యక్షులు దండి సంతోష్ కుమార్ మాట్లాడుతూ ఈనెల 25 న వేములవాడ లోని ఎస్ఆర్ఆర్ గ్రాండ్ హోటల్లో ఉదయం 10 గంటలకు జరిగే ఆత్మీయ సమావేశానికి రాష్ట్ర అధ్యక్షులు విరాహత్ అలీ , జాతీయ కార్యవర్గ సభ్యులు నగునూరి శేఖర్ , ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ , కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల శాసనసభ నియోజకవర్గం ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొంటారని ఆయన తెలిపారు.

ఆత్మీయ సమావేశానికి రాజన్నసిరిసిల్ల జిల్లాలోని జర్నలిస్టు మిత్రులందరు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.ఈ సందర్భంగా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఎల్లారెడ్డిపేట జర్నలిస్టుల సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశానికి ఐజెయు రాజన్నసిరిసిల్ల జిల్లా అధ్యక్షులు దండి సంతోష్ కుమార్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్టు ఎండి మజీద్ మాట్లాడుతూ.జిల్లాలోని జర్నలిస్టు లతో పాటు ఎల్లారెడ్డిపేట జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇప్పించాలని జిల్లా అధ్యక్షులు సంతోష్ ను కోరారు.ఈ సమావేశంలో జిల్లా ఆర్గనైజింగ్ సెక్రెటరీ మహేష్ , ఎల్లారెడ్డిపేట జర్నలిస్టులు బండారి బాల్ రెడ్డి , దుంపేటి గౌరీ శంకర్ , కోండ్లేపు జగదీష్ , కందుకూరి రవీందర్ , కట్టెల బాబు , షరీఫ్ , శ్యామంతుల అనిల్ కుమార్ , చేట్కూరి కృష్ణమూర్తి గౌడ్ , శ్రీ రామోజీ ప్రవీణ్ , బీపేట మనోజ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube