జర్నలిస్టు లందరికీ ఇళ్ళ స్థలాలు ఇవ్వాలి ఎల్లారెడ్డిపేట జర్నలిస్టుల డిమాండ్.

వేములవాడలో ఆత్మీయ సమావేశాన్ని విజయవంతం చేయాలి.ఐజేయు జిల్లా అధ్యక్షులు దండి సంతోష్ కుమార్.

రాజన్న సిరిసిల్ల జిల్లా: జగిత్యాల జిల్లా కేంద్రంలో జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోరుతూ చేస్తున్న ఆందోళనకు రాజన్నసిరిసిల్ల జిల్లా యూనియన్ తరపున ఎల్లారెడ్డిపేట మండల జర్నలిస్టులు తమ సంపూర్ణ మద్దతును ప్రకటించారు.

ఈ సందర్భంగా ఐజేయు జిల్లా అధ్యక్షులు దండి సంతోష్ కుమార్ మాట్లాడుతూ ఈనెల 25 న వేములవాడ లోని ఎస్ఆర్ఆర్ గ్రాండ్ హోటల్లో ఉదయం 10 గంటలకు జరిగే ఆత్మీయ సమావేశానికి రాష్ట్ర అధ్యక్షులు విరాహత్ అలీ , జాతీయ కార్యవర్గ సభ్యులు నగునూరి శేఖర్ , ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ , కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల శాసనసభ నియోజకవర్గం ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొంటారని ఆయన తెలిపారు.

ఆత్మీయ సమావేశానికి రాజన్నసిరిసిల్ల జిల్లాలోని జర్నలిస్టు మిత్రులందరు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

ఈ సందర్భంగా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఎల్లారెడ్డిపేట జర్నలిస్టుల సమావేశం నిర్వహించారు.ఈ సమావేశానికి ఐజెయు రాజన్నసిరిసిల్ల జిల్లా అధ్యక్షులు దండి సంతోష్ కుమార్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్టు ఎండి మజీద్ మాట్లాడుతూ.జిల్లాలోని జర్నలిస్టు లతో పాటు ఎల్లారెడ్డిపేట జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇప్పించాలని జిల్లా అధ్యక్షులు సంతోష్ ను కోరారు.

ఈ సమావేశంలో జిల్లా ఆర్గనైజింగ్ సెక్రెటరీ మహేష్ , ఎల్లారెడ్డిపేట జర్నలిస్టులు బండారి బాల్ రెడ్డి , దుంపేటి గౌరీ శంకర్ , కోండ్లేపు జగదీష్ , కందుకూరి రవీందర్ , కట్టెల బాబు , షరీఫ్ , శ్యామంతుల అనిల్ కుమార్ , చేట్కూరి కృష్ణమూర్తి గౌడ్ , శ్రీ రామోజీ ప్రవీణ్ , బీపేట మనోజ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

పోషకాల లోపం కనిపెట్టేదెలా.. ఆ సంకేతాలేంటి..?