అమెరికా అధ్యక్ష ఎన్నికలు : కార్పోరేట్లే టార్గెట్ .. కమలా హారిస్ సంచలన ప్రకటన

అమెరికా అధ్యక్ష ఎన్నికలు( US President Elections ) హోరాహోరీగా సాగుతున్నాయి.ఓటర్లను ఆకట్టుకునేందుకు రిపబ్లికన్లు, డెమొక్రాట్లు పోటీపడుతున్నారు.

 Us President Elections Kamala Harris Proposes Raising Corporate Tax Rate To 28 P-TeluguStop.com

బైడెన్ రేసులో ఉన్నంత వరకు ఓపీనియన్ పోల్స్, ముందస్తు సర్వేలలో డొనాల్డ్ ట్రంప్( Donald Trump ) దూసుకెళ్లారు.ఎప్పుడైతే బైడెన్ వైదొలిగి కమలా హారిస్ లైన్‌లోకి వచ్చారో ట్రంప్ వెనుకబడ్డారు.

అన్నిట్లో కమలా హారిస్( Kamala Harris ) ఆధిపత్యం ప్రదర్విస్తున్నారు.ఈ నేపథ్యంలో ట్రంప్ శిబిరం అలర్ట్ అయ్యింది.

హామీల విషయంలో ట్రంప్ జాగ్రత్తలు తీసుకుంటున్నారని అమెరికన్ మీడియాలో కథనాలు వస్తున్నాయి.ఇమ్మిగ్రేషన్ విషయంలో కఠినంగా ఉండే ట్రంప్ ఎలాంటి హామీలను ఇస్తారోనని దేశ ప్రజలతో పాటు అంతర్జాతీయ సమాజం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది.

Telugu Corporate Tax, Donald Trump, Kamala Harris, Joe Biden-Telugu NRI

ఇదిలాఉండగా.నవంబర్‌లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో గెలిస్తే కార్పోరేట్ పన్ను రేటును( Corporate Tax Rate ) 21 శాతం నుంచి 28 శాతానికి పెంచుతానని కమలా హారిస్ ప్రతిపాదించినట్లుగా ఆమె ప్రచార బృందం సోమవారం తెలిపింది.హారిస్ ప్రచార ప్రతినిధి జేమ్స్ సింగ్ మాట్లాడుతూ.ఈ చర్య శ్రామికుల జేబుల్లో డబ్బును ఉంచడానికి, బిలియనీర్లు, కంపెనీలు వారి న్యాయమైన వాటాను చెల్లించడానికి బాధ్యత కలిగి ఉండేలా చేస్తుందన్నారు.

కార్పోరేట్ ఆదాయపు పన్ను రేటును 28 శాతానికి పెంచాలని కమలా హారిస్ చేసిన ప్రతిపాదన ఒక దశాబ్దంలో యూఎస్ లోటును 1 ట్రిలియన్ డాలర్ల మేర తగ్గించగలదని న్యాయవాద సమూహం కమిటీ ఫర్ ఏ రెస్పాన్సిబుల్ ఫెడరల్ బడ్జెట్ సోమవారం పేర్కొంది.

Telugu Corporate Tax, Donald Trump, Kamala Harris, Joe Biden-Telugu NRI

అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు డొనాల్డ్ ట్రంప్ కార్పోరేట్ పన్ను రేటును 35 శాతం నుంచి 21 శాతానికి తగ్గించిన సంగతి తెలిసిందే.అలాగే పదవి నుంచి దిగిపోవడానికి ఏడాది ముందు పలు పన్ను మినహాయింపులను ఆయన అమలు చేశారు.యూఎస్ పన్ను కోడ్‌లో మార్పులు చేయాలంటే దానికి కాంగ్రెస్ ఆమోదం అవసరం.

సెనేట్, ప్రతినిధుల సభలపై నియంత్రణ కోసం డెమొక్రాట్‌లు, రిపబ్లికన్‌లు హోరాహోరీగా తలపడుతున్నారు.ఏడాదికి 4 లక్షల డాలర్లు అంతకంటే తక్కువ సంపాదించే వ్యక్తులపై పన్నులు పెంచకూడదని జో బైడెన్ చేసిన వాగ్ధానాన్ని నిలబెట్టుకుంటానని కమలా హారిస్ వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube