బీజేపీపై కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి( Renuka Chowdary ) మండిపడ్డారు.ఏ అధికారంతో ఢిల్లీ పోలీసులు( Delhi Police ) తెలంగాణలో దిగారని ప్రశ్నించారు.
ఏ హక్కుతో గాంధీభవన్ కు( Gandhi Bhawan ) వచ్చి తమ వాళ్లపై కేసులు పెడుతున్నారని ఎంపీ రేణుకా చౌదరి ఆరోపించారు.తెలంగాణ తడాఖా ఏంటో చూపిస్తామన్నారు.
బీజేపీ నేతలు( BJP Leaders ) ఏం చేసినా ఎన్నికల అధికారులు పట్టించుకోవడం లేదని చెప్పారు.ఈ క్రమంలోనే కొందరు దొంగ సర్టిఫికెట్లతో పార్లమెంట్ కు వస్తున్నారని పేర్కొన్నారు.
దేశంలో ఉన్న ముస్లింలకు మోదీ ( Modi ) ప్రధాని కాదా అని ఆమె ప్రశ్నించారు.