మూగజీవులకు మనషుల నుంచి అనునిత్యం ముప్పు ఉంటుంది.కొందరు కిరాతకులు వాటిని కారణం లేకపోయినా హింసిస్తుంటారు.
వారి క్రూరత్వం వల్ల ఎక్కువగా బాధపడేది కుక్కలే అని చెప్పుకోవచ్చు.అదృష్టం బాగుంటే వాటికి హింస నుంచి విముక్తి కలుగుతుంది.
ఇలాంటి కుక్కల హ్యాపీ ఎండింగ్ స్టోరీస్ తరచుగా వైరల్ అవుతుంటాయి.తాజాగా చెస్టర్ అనే పిట్ బుల్ జాతి కుక్క( Chester Pit bull Dog ) విషాద కథ సుఖాంతం అయింది.
దీనిని ఎవరో ఒక ఖాళీ ఇంటి వద్ద చైన్‌తో కట్టి అన్నం, నీళ్లు లేకుండా అలానే వదిలేశారు.అదే ఇంటి వద్ద దానితో పాటు మరో మూడు కుక్కలు కూడా ఉన్నాయి.
వారం రోజుల పాటు అవి అక్కడే ఉండిపోయాయి.ఆహారం లేక చెస్టర్ చాలా బలహీనంగా, ఎముకలు కనపడేలా తయారైంది.
అది నిలబడలేక, పడుకోలేక చాలా ఇబ్బంది పడింది.దాని పాదం ఒక ముళ్ల కాలర్‌లో ఇరుక్కుపోయి గాయపడింది.
చివరికి అది రెస్క్యూయర్ల కంట పడింది.
రక్షకులు చెస్టర్‌ను యూక్లిడ్ యానిమల్ షెల్టర్( Euclid Animal Shelter )కు తీసుకెళ్లారు.అక్కడ దానికి సరైన చికిత్స, ప్రేమ లభించింది.గుండెపోటు, మాంగే వంటి ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న దానికి సుమారు 10 నెలల పాటు చికిత్స అందించారు.
షెల్టర్ సిబ్బంది అతనికి తగినంత ఆహారం ఇచ్చి, బరువు పెంచారు.చెస్టర్ ఆరోగ్యంగా మారినా, దానిని దత్తత తీసుకోవడానికి ఎవరూ ముందుకు రాలేదు.ఫలితంగా అది 587 రోజుల పాటు షెల్టర్‌లో ఉండిపోవాల్సి వచ్చింది.చివరకు, లారెన్ రీట్స్‌మన్( Lauren Reitsman ) అనే మహిళ అతనిని దత్తత తీసుకునేందుకు ముందుకు వచ్చింది.
ఆమె సోషల్ మీడియాలో చెస్టర్ ఫోటో చూసి, దానిని తన ఇంటికి తీసుకొచ్చి పెంచాలని అనుకుంది.
చెస్టర్‌ను లారెన్ ఇంటికి ఒక లిమోజిన్ కారులో తీసుకెళ్లారు.ఈ కారును లేక్ ఎరీ లిమో అనే సంస్థ దానం చేసింది.చెస్టర్ ఇప్పుడు సుమారు నాలుగు లేదా ఐదు సంవత్సరాల వయసులో ఉంటుంది, ఈ కుక్క ఆటలు ఆడుకోవడం, పొట్ట రుబ్బించుకోవడం ద్వారా జీవితాన్ని ఎంజాయ్ చేస్తోంది.
లారెన్ దానిని చాలా ఇష్టపడుతుంది.దానిని పేరును చెస్టర్ విలియం రీట్స్‌మన్ ది ఫస్ట్, ఆఫ్ రాయల్టన్ అని పెట్టింది.ఈ కుక్క కథ తెలుసుకున్న చాలా మంది హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.