IPL Smart Replay System : ఐపీఎల్ 2024లో సరికొత్తగా స్మార్ట్ రీప్లే సిస్టమ్ రూల్.. ఈ రూల్ ఎలా పని చేస్తుందంటే..?

ఐపీఎల్ 2024లో సరికొత్తగా స్మార్ట్ రీప్లే సిస్టమ్ రూల్( Smart Replay System Rule ) ను అమలు చేయనున్నారు.ఈ రూల్ ప్రధాన లక్ష్యం ఏమిటంటే.

 Ipl To Introduce Smart Replay System For 2024 Season-TeluguStop.com

అంపైర్లు తీసుకునే నిర్ణయాల్లో మరింత ఖచ్చితత్వాన్ని, వేగాన్ని పెంచడం కోసమే.ఈ స్మార్ట్ రీప్లే సిస్టమ్ రూల్ ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం.

టీవీ అంపైర్ ఉండే గదిలో ఇద్దరు హక్-ఐ ఆపరేటర్లు కూర్చొని, స్మార్ట్ రీప్లే సిస్టమ్ లో భాగంగా ఫీల్డ్ అంతటా 8 హక్-ఐ హై స్పీడ్ కెమెరాల ద్వారా పొందిన పుటేజీని అందిస్తారు.దీంతో టీవి అంపైర్ అన్ని ఫ్రేమ్ ల సమకాలీకరించబడిన ఫిల్మ్ ను వీక్షించి తొందరగా నిర్ణయం తీసుకుంటాడు.

గతంలో లాగా థర్డ్ అంపైర్- హక్-ఐ మధ్య లింక్ గా పని చేసిన టీవీ ప్రసారం డైరెక్టర్ కొత్త సెటప్ లో పాల్గొనరు.టీవీ అంపైర్ నివేదిక ప్రకారం.

స్మార్ట్ రీప్లే సిస్టమ్ కు గతంలో చేసిన దానికంటే, స్ప్లిట్- స్క్రీన్( Split Screen ) చిత్రాలతో సహా మరిన్ని విజువల్స్ కు యాక్సెస్ ఉంటుంది.

Telugu Cricket, Iplsmart, Smartreplay, Smartreview, Split Screen, Umpire-Sports

ఈ స్మార్ట్ రీప్లే సిస్టమ్ రూల్ లో భాగంగా ఫీల్డ్ లో 8 హక్-ఐ కెమెరాలు( Eight Hawk-Eye Cameras ) ఉంటాయి.ఈ కెమెరాలు ఎక్కడెక్కడ ఉంటాయంటే.పిచ్ కి ప్రతి వైపు నేరుగా సరిహద్దు వెంట రెండు కెమెరాలు, స్క్వేర్ లెగ్ కు రెండు వైపులా రెండు కెమెరాలు ఉంటాయి.

స్టంపింగ్ రిఫరల్ ను అనుసరించి హాక్-ఐ ఆపరేటర్ల నుండి స్ప్లిట్ స్క్రీన్ ను వీక్షించడానికి, అభ్యర్థించడానికి టీవీ అంపైర్( TV Umpire Tri Vision ) ) స్మార్ట్ రివ్యూ సిస్టంను ఉపయోగిస్తాడు.సైడ్ ఆన్, ఫ్రంట్ అండ్ కెమెరాల నుండి ఒకే ఫ్రేమ్ ఫిల్మ్ కొత్త సాంకేతికతను ఉపయోగించి కోసం ప్రదర్శించబడుతుంది.

Telugu Cricket, Iplsmart, Smartreplay, Smartreview, Split Screen, Umpire-Sports

టీవీ అంపైర్- హక్-ఐ ఆపటేటర్ మధ్య సంభాషణలు ప్రత్యక్ష ప్రసారం చేయబడతాయి.ఇలా చేయడం వల్ల క్రికెట్( Cricket ) వీక్షిస్తున్న అభిమానులకు అంపైర్ల తీర్పు వెనుక ఉన్న తార్కికం గురించి అవగాహన వస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube