లక్ష్మీదేవి( Lakshmi Devi ) అనుగ్రహం ఉంటే చాలు ఎవరైనా ధనవంతులు అవుతారని ఖచ్చితంగా చెప్పవచ్చు.అలాగే తమ జీవితాంతం సంతోషంగా ఉంటామని, తమ ఇల్లు సంపదలతో నిండి ఉంటుందని చాలా మంది ప్రజలు నమ్ముతారు.
మనలో ప్రతి ఒక్కరు కూడా ధనలక్ష్మి ఆశీస్సులు కావాలని కోరుకుంటూ ఉంటారు.ఎందుకంటే లక్ష్మీదేవి మన ఇంట్లో ఉంటేనే ధనానికి లోటు ఉండదు.
అందుకే లక్ష్మీదేవి మన ఇంట్లోకి రావాలని, లక్ష్మీ కటాక్షం మనకు సిద్దించాలని మన ఇంట్లో నుంచి లక్ష్మీదేవి ఎప్పుడు కూడా బయటకి వెళ్లకూడదని చాలామంది ప్రజలు ఎన్నో రకాల పూజలు, వ్రతాలు చేస్తూ ఉంటారు.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వచ్చే ముందు కొన్ని శుభసంకేతాలు పంపిస్తుంది.నల్ల చీమలు ఇంట్లోకి రావడం ప్రారంభమైతే, ఏదైనా ఆహార పదార్థాన్ని ఒక్కసారిగా గుంపుగా తినడం ప్రారంభమైతే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగుపెడుతుందని, మీకు డబ్బు లభిస్తుందని అర్థం చేసుకోవచ్చు.ఎందుకంటే నల్ల చీమలు( Black Ants ) మీ ఇంట్లోకి వరుస కట్టి వచ్చి ఏదైనా ఆహార పదార్ధం తింటున్నట్లుగా మీకు కనిపిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి రాబోతుందని అర్థం చేసుకోవచ్చు.
అలాగే పక్షులు ఖాళీ ప్రదేశం లేక ఎక్కడపడితే అక్కడ గుడు కట్టుకుంటూ ఉంటాయి.అయితే ఏదైనా పక్షి వచ్చి మీ ఇంట్లో గూడు కట్టుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహనికి అది సంకేతం.
అలాగే ప్రతి రోజు తులసి మొక్క( Basil plant ) చుట్టూ అనేక బల్లులు ఒకేసారి కనిపిస్తే అది అశుభ సంకేతంగా పరిగణిస్తారు.ఇలా జరగడం మీకు మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు.ముఖ్యంగా చెప్పాలంటే పురుషులలో ఎడమ కంటి పై బల్లి పడితే శుభవార్త వింటారు.ఏ పని తలపెట్టినా కానీ విజయవంతం అవుతుందని అర్థం చేసుకోవచ్చు.ఈ విధంగా లక్ష్మీ దేవి ఇంటికి వచ్చే ముందు కొన్ని సంకేతాలు మీకు కనిపిస్తాయి.ఈ సంకేతాలను బట్టి మీ ఇంటికి లక్ష్మీదేవి వస్తుందని అర్థం చేసుకోవచ్చు.
DEVOTIONAL