ముఖ్యంగా చెప్పాలంటే మనీ ప్లాంట్( Money plant ) ఒక వ్యక్తికి ఆర్థిక ప్రయోజనాలను కలిగిస్తుందని దాదాపు చాలా మందికి తెలుసు.అయితే ఈ మొక్కకు సంబంధించిన ఎన్నో నమ్మకాలు ఉన్నాయి.
వాస్తు శాస్త్రం ప్రకారం( Vastu Shastra ) మనీ ప్లాంట్ ను కొన్ని విధాలుగా అస్సలు పెట్టకూడదు.దీని వల్ల మీరు ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
చాలా చెట్లు, మొక్కలు ఇంటి అందన్ని పెంచడానికి మాత్రమే కాకుండా, మన ఇంటికి ఆనందాన్ని, శ్రేయస్సును కూడా తెస్తాయి.

ఇలాంటి మొక్కల్లో మనీ ప్లాంట్ కూడా ఒకటి.ఈ మొక్క చాలా మంది ఇళ్లలో ఉంటుంది.అయితే మనీ ప్లాంట్ ను దొంగలించి పెడితే అదృష్టం పెరుగుతుందని చాలా మంది నమ్ముతారు.
మరి దీని పై వాస్తు శాస్త్రం ఏం చెబుతుందో ఎప్పుడు తెలుసుకుందాం.ఎన్నో రకాల నమ్మకాల ప్రకారం మనీ ప్లాంట్ పచ్చగా ఉండే ఇంట్లో డబ్బుకు ఎలాంటి కొరత ఉండదు.
ముఖ్యంగా చెప్పాలంటే మనీ ప్లాంట్ ను దొంగతనం చేసి నాటకూడదని వాస్తు శాస్త్రం చెబుతోంది. మనీ ప్లాంట్ మొక్కలను కోని ఇంట్లో పెట్టడం మంచిది.అప్పుడే మీ మనీ ప్లాంట్ పూర్తి ప్రయోజనాలను పొందుతారు.

అలాగే ఆర్థిక ప్రయోజనాలు కూడా పొందవచ్చు.మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉంటే దానిని ఎవరికి ఇవ్వకూడదు.ఈ మొక్కను ఎవరికైనా ఇస్తే మీ ఆర్థిక పరిస్థితి అంతా బాగుండదు.
ఆర్థిక సమస్యలు కూడా వస్తాయి.అలాగే మనీ ప్లాంట్ ను భూమికి తాగకుండా చూసుకోవాలి.
ఇలా భూమికి తాకితే ఇంటికి ఆ శుభమని నిపుణులు చెబుతున్నారు.అలాగే వాస్తు శాస్త్రం ప్రకారం మనీ ప్లాంట్ ను సరైన దిశలో పెట్టాలి.
వాస్తు శాస్త్రం ప్రకారం ఈశాన్య దిశలో మనీ ప్లాంట్ ను ఉంచకూడదు.ఇలా చేయడం వల్ల మీరు ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.







