టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది గొప్ప రచయితలు అడుగుపెట్టారు.పాతకాలంలో పింగళి తన మాటలతో మంత్రం వేసేవారు.
పింగళి మాయాబజార్ సినిమా కోసం రాసిన డైలాగులు భలే చిత్రంగా ఉంటాయి.అందుకే ఇతనికి మాటల మాంత్రికుడు అనే పేరు కూడా వచ్చింది.
కొంత కాలానికి జంధ్యాల తన రచనలతో కడుపుబ్బా నవ్వించారు.జంధ్యాల కాలం ముగిసిన తర్వాత టాలీవుడ్లో యాక్షన్ సినిమాలు ఎక్కువగా వచ్చాయి.
అలాంటి సమయంలో మరొక మాటల మాంత్రికుడు మన తెలుగు సినిమా ఇండస్ట్రీకి దొరికాడు.అతనే త్రివిక్రమ్.
ఫిజిక్స్ చదువుకొని ఆపై తెలుగు సాహిత్యం పై పట్టు సాధించాడు త్రివిక్రమ్.ఈ రైటర్ కమ్ డైరెక్టర్ మాటలు కూడా బాగా ఆకట్టుకుంటాయి.
నువ్వే నువ్వే, అతడు, జల్సా, ఖలేజా, జులై, సన్నాఫ్ సత్యమూర్తి ఇలా ఆయన డైలాగులు అందించిన ఏ సినిమా చూసినా మనం ఫిదా అయిపోక తప్పదు.ఈ సినిమాలలోని డైలాగులు ఆలోచింపజేసేలా, నవ్వు పుట్టించేలా ఉంటాయి. త్రివిక్రమ్( Trivikram Srinivas ) పంచుల్లో ఏదో గమ్మత్తు ఉంది అని చాలామంది అంటుంటారు.అయితే మాటల మాంత్రికుడు అనే పేరుకు ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సరిపోవడం లేదు.
తెలుగు ప్రాసలు, పంచు డైలాగులను ఆయన సరిగా రాయలేకపోతున్నాడు.పైగా అసభ్యకరమైన సోషల్ మీడియా బూతులు తన సినిమాలోని పాటకు వాడేసుకున్నాడు.గుంటూరు కారం సినిమా( Guntur Kaaram ) సినిమాలో “ఆ కుర్చీని మడత పెట్టి.” అనే డైలాగ్ తో అతడు ఒక పాట చేశాడు.
ఒకప్పుడు మంచి డైలాగులు, కథలు రాసి ఆకట్టుకున్న త్రివిక్రమ్ ఇప్పుడు మాత్రం ఆల్రెడీ తీసిన కథలనే వేరే సినిమాలకి వాడుకుంటున్నాడు.కాపీ కొడుతున్నాడు అనే విమర్శలు కూడా అతనిపై ఎక్కువ అవుతున్నాయి.
గతంలో త్రివిక్రమ్ ను బాగా ఆదరించిన ప్రేక్షకుల ఇప్పుడు ఆ దర్శకుడికి ఏమైంది అంటూ విస్తు పోతున్నారు.ఎంతో మంచి సినిమాలు తీసిన ఈ మాటలు మాంత్రికుడు ఇప్పుడు వివేకం కోల్పోయి ఇలాంటి బూతులను వాడుకోవడం చాలామందిని షాక్‌కి గురి చేస్తోంది.
మళ్లీ పాత త్రివిక్రమ్ శ్రీనివాస్‌ను చూడాలని కోరుకుంటున్నారు.కొత్త త్రివిక్రమ్ ను అసలు యాక్సెప్ట్ చేయడం లేదు.మరి త్రివిక్రమ్ తదుపరి సినిమాలతో మంచి హిట్స్ కొడతాడో లేదో చూడాలి.గుంటూరు కారంతో అట్టర్ ప్లాప్ అందుకున్నాడు కాబట్టి భవిష్యత్తులో అతనితో స్టార్ హీరోలు సినిమా తీయడానికి సందేహించవచ్చు.
అల్లు అర్జున్ తో ఒక సినిమా చేస్తున్నట్లయితే తెలుస్తోంది.