తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) పర్యటన కొనసాగుతోంది.ఇందులో భాగంగా ఆయన కేంద్ర రోడ్డు మరియు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో( Nitin Gadkari ) సమావేశం అయ్యారు.
రేవంత్ రెడ్డి వెంట డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఉన్నారు.
కాగా ఈ సమావేశంలో ప్రధానంగా తెలంగాణలో జాతీయ రహదారుల( National Highways ) అభివృద్ధి ప్రాజెక్టులపై చర్చించారు.అదేవిధంగా ఫ్లై ఓవర్లు, రీజనల్ రింగ్ రోడ్డు సహా పలు అభివృద్ధి ప్రాజెక్టులపై చర్చించారని తెలుస్తోంది.