ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అయోధ్య( Ayodhya ) నగరంలో రామ మందిరం ఈ ఏడాది జనవరి నెలలో ప్రారంభమైన సంగతి తెలిసిందే.ఈ ఆలయంలో కొలువైన బాల రాముడిని సందర్శించేందుకు భారతదేశం నలుమూలల నుంచి లక్షలాదిమంది అయోధ్యకు తరలి వెళ్తున్నారు.
వివిధ నగరాల నుంచి వీరిని అయోధ్యకు ఆస్తా స్పెషల్ ట్రైన్లు తీసుకెళ్తున్నాయి.ట్రైన్లలో అందించే ఆహారం, సర్వీస్ చాలా బాగుంది అని వెళ్ళొచ్చిన యాత్రికులు చెబుతున్నారు.
అయితే అయోధ్య నగరంలో దిగిన తర్వాత దొంగల బెడద ఎక్కువగా ఉందని, ఆడవారు నగలను దాచి పెట్టుకోవడం ముఖ్యమని కొందరు హెచ్చరిస్తున్నారు.వీలైనంతవరకు బంగారు నగలను వెంట తీసుకురాకపోవడమే శ్రేయస్కరమని సలహా ఇస్తున్నారు.
ఎంతమంది ఉన్నా సరే దర్శనం రెండు నుంచి మూడు గంటల వ్యవధిలో జరిగిపోతుందని కొంతమంది భక్తులు వెల్లడించారు.అయితే ఆస్తా ట్రైన్లో టికెట్స్ బుక్ చేసుకున్న వారు రైల్వే స్టేషన్ కి రెండు గంటలకు ముందే చేరుకోవాలట.
స్టేషన్లో ఆధార్ కార్డు(Aadhaar card ) చూపిస్తేనే రైల్లో ఎక్కేందుకు కావలసిన ఐడీ కార్డ్ ఇస్తారు.ఈ ఐడీ కార్డు తీసుకోకపోతే ట్రైన్లోకి అనుమతించరని గమనించాలి.
రైలులో వడ్డించే ఆహారం బాగుంటుంది కానీ కాస్త ఉప్పు తక్కువ వేస్తారు.ఉత్తర భారత దేశంలో ఉప్పు చాలా తక్కువగా తింటారు.వారి స్టైల్ లోనే ఈ వంటకాలు ప్రిపేర్ చేస్తున్నారు.కాబట్టి సౌత్ ఇండియన్స్ ఈ విషయాన్ని గమనించాలి.ఉప్పు లేకపోతే చప్పటి కూరలు కొంతమంది తినలేక పోవచ్చు.ఆ కారణంగా వెంటే కొంచెం ఉప్పు తీసుకెళ్లొచ్చు.
కుదిరితే పచ్చళ్ళు కూడా తీసుకురావచ్చు.బెడ్ షీట్, దుప్పటి, దిండ్లు, చద్దర్లు ట్రైన్ సిబ్బంది అందజేస్తుంది.
కాబట్టి మరీ ఎక్కువగా వీటిని తీసుకురావాల్సిన అవసరం లేదు.అలాగని ఏమీ లేకుండా ట్రైన్ ఎక్కేయకూడదు.
మరీ భారం కాకుండా తీసుకురావడానికి 1- దుప్పట్లు తీసుకొచ్చుకోవచ్చు.ట్రైన్స్ చాలా పరిశుభ్రంగా ఉంటాయి.
రామ భక్తులకు అనునిత్యం వీఐపీ లెవెల్ లో సెక్యూరిటీ లభిస్తుంది.స్టేషన్లో అజ్ఞాత వ్యక్తులు ఎవరూ ఎక్కకుండా పోలీసులు చూసుకుంటారు.
అలాగే రామ భక్తులు బోగీ దిగి తప్పిపోకుండా కూడా కాపలా వస్తుంటారు.
ట్రైన్ అయోధ్యకు 16 కిలోమీటర్ల దూరంలో ఉన్న సాలార్పూర్ వద్ద ఆగుతుంది.రైలు దిగాక ఉచితంగా అందుబాటులో ఉండే బస్సులు ఎక్కవచ్చు.ఈ బస్సులు అయోధ్యకి సుమారు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఏర్పాటు చేసిన యాత్రికుల వసతి శిబిరం వద్ద ఆగుతాయి.
ప్రతి 200 మందికి ఇక్కడ ఒక హాలు అందిస్తారు.మగవారికి, ఆడవారికి సపరేట్ గా హాల్స్ ఉంటాయి.ఈ హాలు లోపలికి ప్రవేశించాలన్నా ఐడీ కార్డు చూపించడం తప్పనిసరి.ఈ హాల్లో బాత్రూం నుంచి బెడ్స్ వరకు అన్ని సౌకర్యాలు ఉంటాయి.
బాల రాముడు దర్శనానికి ప్రత్యేక టికెట్లు ఏమీ కొనాల్సిన అవసరం లేదు.ఎందుకంటే ప్రత్యేక దర్శనాలు అంటూ ఏమీ ఉండవు.
అందరూ సర్వదర్శనం లాగానే ఒకే క్యూలోని దేవుడిని చూడాల్సి ఉంటుంది.బాల రాముడిని( Lord Ram ) సందర్శించాక తిరిగి వెళ్లే క్రమంలో కూడా ఐడి కార్డులను చూపించాల్సి ఉంటుంది కాబట్టి దానిని ఇంటికి వచ్చేంతవరకు పోగొట్టుకోకుండా జాగ్రత్త పడటం మంచిది.
DEVOTIONAL