ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి( AP CM YS Jagan ) గురువారం సాయంత్రం ఢిల్లీ చేరుకున్నారు.సాయంత్రం ఐదు గంటలకి విజయవాడలోని గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరిన జగన్ రాత్రి ఢిల్లీకి చేరుకున్నారు.
ఈ క్రమంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా( Union Home Minister Amit Shah )తో రాత్రి 10 గంటలకు భేటీ కానున్నారు.అనంతరం రాత్రి హస్తినాలో జన్ పథ్ నివాసంలో బస చేయనున్నారు.
ఆ తర్వాత శుక్రవారం ఉదయం 11 గంటలకు ప్రధాని మోదీ( PM Narendra Modi )తో సమావేశం కానున్నారు.ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించి పలు కీలక అంశాలపై చర్చ జరపనున్నట్లు సమాచారం.
ప్రధానంగా పోలవరం నిధుల విడుదల, కేంద్రం నుంచి రాష్ట్రానికి రావలసిన పన్ను చెల్లింపులు, ప్రత్యేక హోదా( AP Special Status ), విభజన హామీలు, కొత్త జిల్లాలలో ఏర్పాటు అవుతున్న మెడికల్ కాలేజీలకు కేంద్రం వాటాగా మరింత సాయం, పెండింగ్ బిల్లులు లాంటి తదితర అంశాలపై సమావేశంలో మాట్లాడనున్నట్లు సమాచారం.ఏపీలో ప్రధాన పార్టీల రాజకీయ నాయకులు వరుసగా ఢిల్లీ పర్యటనలు చేపట్టడం సంచలనంగా మారింది.ఆల్రెడీ బుధవారం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఢిల్లీ టూర్( Delhi Tour ) చేపట్టారు. పవన్ కళ్యాణ్ కూడా వెళ్ళనున్నట్లు వార్తలు వస్తున్నాయి.సరిగ్గా ఎన్నికలకు రెండు నెలల ముందు ప్రధాన పార్టీల నేతలు వరుస పెట్టి ఢిల్లీ పర్యటనలు చేపట్టడం రాష్ట్ర రాజకీయ వర్గాలలో చర్చనీయాంశంగా మారింది.