ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో మూడు నెలలలో ఎన్నికలు( AP Elections ) రాబోతున్నాయి.ఈ ఎన్నికలలో గెలవడానికి ప్రధాన పార్టీలు రకరకాల వ్యూహాలతో సిద్ధం అవుతున్నారు.
ఇప్పటికే కొన్ని పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి.మరి కొన్ని పార్టీలు పొత్తులు పెట్టుకుంటూ సీట్ల సర్దుబాటు, ఉమ్మడి ఎన్నికల మేనిఫెస్టో పై చర్చలు జరుగుతున్నాయి.
ఈ రకంగా ప్రధాన పార్టీలు ఎన్నికల విషయంలో రకరకాల పనులలో నిమగ్నమయ్యాయి.ఈ క్రమంలో తాజాగా 2024 ఎన్నికలకు( 2024 Elections ) సంబంధించి ఈసీ ఏపీ ఓటర్ లిస్ట్( AP Voter List ) విడుదల చేయడం జరిగింది.
ఎలక్షన్ కమిషన్ విడుదల చేసిన లిస్టులో రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 4,08,07,256 మంది ఓటర్లు ఉన్నారు.
ఏపీలో పురుషుల ఓటర్ల సంఖ్య( Male Voters ) 2,00,09,275, మహిళా ఓటర్ల సంఖ్య( Female Voters ) 2,07,37,065, సర్వీస్ ఓటర్లు 67,434 మంది థర్డ్ జెండర్ ఓటర్లు 3482 మంది ఉన్నట్లు ప్రకటించడం జరిగింది.అత్యధికంగా కర్నూలు జిల్లాలో 20,16,396.అత్యల్పంగా అల్లూరి జిల్లాలో 7,61,538 మంది ఉన్నారు.2024 ఎన్నికలకి ఎలక్షన్ కమిషన్( Election Commission ) పగడ్బందీగా వ్యవహరిస్తుంది.ఓటర్ల విషయంలో ఏమాత్రం అవ్వకతవకలకు అధికారులు పాల్పడుతుంటే వెంటనే సస్పెండ్ చేస్తూ ఉంది.
ఈ రకంగానే ఏపీలో ఒక కలెక్టర్ సస్పెండ్ కూడా కావడం జరిగింది.తెలంగాణలో మాదిరిగానే ఏపీలో కూడా ఎన్నికలు సజావుగా సాగే విధంగా ఎలక్షన్ అధికారులు ముందు నుండి అన్ని ఏర్పాట్లు చూసుకుంటున్నారు.