తెలంగాణలో ధరణి కమిటీ( Dharani Committee )కి ఫాల్కన్ సంస్థ వ్యవహారం సవాల్ గా మారిందని తెలుస్తోంది.ధరణి పోర్టల్ లోని సమస్యలపై అధ్యయనం చేసేందుకు ఫాల్కన్ సంస్థ స్పందించడం లేదని సమాచారం. ధరణి పోర్టల్ ను రూపొందించడంతో పాటు రికార్డులను ఫాల్కన్ సంస్థ( Falcon Company ) డిజిటలైజేషన్ చేసింది.అయితే ఇటీవల ధరణి సమస్యలపై ఏర్పాటైన కమిటీ మూడు సార్లు వివిధ అంశాలపై చర్చించేందుకు రావాలని పిలుపునిచ్చింది.
అయితే ఇప్పటివరకు ఫాల్కన్ సంస్థ నుంచి ఎటువంటి రియాక్షన్ లేకపోవడంతో ధరణి కమిటీ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.