Hanuman : అప్పుడు 4 ఇప్పుడు 15.. హైదరాబాద్ లో హనుమాన్ సక్సెస్ కు ఇంతకంటే సాక్ష్యం కావాలా?

ప్రశాంత్ వర్మ ( Prashant Verma )దర్శకత్వంలో తేజా సజ్జా ( Teja Sajja )హీరోగా నటించిన హనుమాన్ సినిమా ఇటీవలె ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.భారీ అంజనాల నడుమ విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ ని అందుకుంది.

 Hanuman Screen Count Gets Increased-TeluguStop.com

ఇది ఇలా ఉంటే సినిమా విడుదల సమయంలో సరిపడే నన్ను స్క్రీన్లు దొరకగా హనుమాన్ సినిమా చాలా ఇబ్బంది పడింది.కానీ ఈ ప్రస్తుతం హనుమాన్ సినిమాకు( Hanuman movie ) ఆ సమస్య లేదు.

ఎందుకంటే మొదటివారం హైదరాబాద్ లో నాలుగు సింగల్ స్క్రీన్లు ఇస్తే ఇప్పుడా కౌంట్ ఏకంగా పదిహేనుకు చేరుకుంది.గుంటూరు కారం కోసం రిజర్వ్ చేసుకున్నవి కొన్ని హనుమాన్ కి ఇచ్చేశారు.

Telugu Hanuman, Screen, Teja Sajja, Tollywood-Movie

మల్టీప్లెక్సుల్లో ఉన్న పెద్ద తెరలు క్రమంగా జనాలు దేన్ని ఎక్కువగా కోరుకుంటున్నారో వాటిని వేయడానికే ప్లాన్ చేసుకుంటున్నాయి.ప్రసాద్ పిసిఎక్స్ స్క్రీన్ ( Prasad PCX screen )లో మొన్నటి నుంచే హనుమాన్ కి అయిదారు షోలు ఇస్తున్నారు.ఉత్తరాంధ్ర, కోస్తా, ఆంధ్రలో నా సామిరంగక షోలు పెంచుతున్నారు.బిసి సెంటర్లలో మంచి డిమాండ్ ఉండటంతో క్రమంగా అక్కడ పెరుగుదల కనిపిస్తోంది.మొత్తానికి అప్పుడు కేవలం 4 ఇప్పుడు 15 థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా ప్రదర్శితమవుతూ రికార్డుల మోత మోగిస్తోంది హనుమాన్ సినిమా.ఒకవేళ వచ్చే నెల 9 వరకు ఎటువంటి సినిమాలు మధ్యలో విడుదల కాకపోతే ఈ సినిమా మరిన్ని రికార్డులు సృష్టించడం ఖాయం అని తెలుస్తోంది.

Telugu Hanuman, Screen, Teja Sajja, Tollywood-Movie

ఇప్పటికే ఈ సినిమా 100 కోట్ల గ్రాస్ ను దాటిపోయిన విషయం తెలిసిందే.ఇప్పుడు మరిన్ని రికార్డులు సృష్టించడానికి సిద్ధమవుతోంది హనుమాన్ మూవీ.సంక్రాంతి బరిలో నిలిచిన మిగతా మూడు సినిమాలు అయినా గుంటూరు కారం, సైంధవ్,నా సామిరంగ సినిమాలు అంతంతమాత్రంగానే టాక్ ని తెచ్చుకోవడంతో ఈ సినిమాకు ప్రేక్షకులు క్యూ కడుతున్నారు.ముందు ముందు హనుమాన్ సినిమా ఇంకా ఎలాంటి అంచనాలను క్రియేట్ చేస్తుందో చూడాలి మరి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube