Hanuman : అప్పుడు 4 ఇప్పుడు 15.. హైదరాబాద్ లో హనుమాన్ సక్సెస్ కు ఇంతకంటే సాక్ష్యం కావాలా?

ప్రశాంత్ వర్మ ( Prashant Verma )దర్శకత్వంలో తేజా సజ్జా ( Teja Sajja )హీరోగా నటించిన హనుమాన్ సినిమా ఇటీవలె ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.

భారీ అంజనాల నడుమ విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ ని అందుకుంది.

ఇది ఇలా ఉంటే సినిమా విడుదల సమయంలో సరిపడే నన్ను స్క్రీన్లు దొరకగా హనుమాన్ సినిమా చాలా ఇబ్బంది పడింది.

కానీ ఈ ప్రస్తుతం హనుమాన్ సినిమాకు( Hanuman Movie ) ఆ సమస్య లేదు.

ఎందుకంటే మొదటివారం హైదరాబాద్ లో నాలుగు సింగల్ స్క్రీన్లు ఇస్తే ఇప్పుడా కౌంట్ ఏకంగా పదిహేనుకు చేరుకుంది.

గుంటూరు కారం కోసం రిజర్వ్ చేసుకున్నవి కొన్ని హనుమాన్ కి ఇచ్చేశారు. """/" / మల్టీప్లెక్సుల్లో ఉన్న పెద్ద తెరలు క్రమంగా జనాలు దేన్ని ఎక్కువగా కోరుకుంటున్నారో వాటిని వేయడానికే ప్లాన్ చేసుకుంటున్నాయి.

ప్రసాద్ పిసిఎక్స్ స్క్రీన్ ( Prasad PCX Screen )లో మొన్నటి నుంచే హనుమాన్ కి అయిదారు షోలు ఇస్తున్నారు.

ఉత్తరాంధ్ర, కోస్తా, ఆంధ్రలో నా సామిరంగక షోలు పెంచుతున్నారు.బిసి సెంటర్లలో మంచి డిమాండ్ ఉండటంతో క్రమంగా అక్కడ పెరుగుదల కనిపిస్తోంది.

మొత్తానికి అప్పుడు కేవలం 4 ఇప్పుడు 15 థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా ప్రదర్శితమవుతూ రికార్డుల మోత మోగిస్తోంది హనుమాన్ సినిమా.

ఒకవేళ వచ్చే నెల 9 వరకు ఎటువంటి సినిమాలు మధ్యలో విడుదల కాకపోతే ఈ సినిమా మరిన్ని రికార్డులు సృష్టించడం ఖాయం అని తెలుస్తోంది.

"""/" / ఇప్పటికే ఈ సినిమా 100 కోట్ల గ్రాస్ ను దాటిపోయిన విషయం తెలిసిందే.

ఇప్పుడు మరిన్ని రికార్డులు సృష్టించడానికి సిద్ధమవుతోంది హనుమాన్ మూవీ.సంక్రాంతి బరిలో నిలిచిన మిగతా మూడు సినిమాలు అయినా గుంటూరు కారం, సైంధవ్,నా సామిరంగ సినిమాలు అంతంతమాత్రంగానే టాక్ ని తెచ్చుకోవడంతో ఈ సినిమాకు ప్రేక్షకులు క్యూ కడుతున్నారు.

ముందు ముందు హనుమాన్ సినిమా ఇంకా ఎలాంటి అంచనాలను క్రియేట్ చేస్తుందో చూడాలి మరి.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – నవంబర్20, బుధవారం 2024