మంచు తుఫానుకు అమెరికా గజగజ : అసలే గడ్డకట్టే చలి , ఆపై గ్యాస్ .. విద్యుత్ సరఫరాలకు అంతరాయం

అగ్రరాజ్యం అమెరికాను చలి పులి వణికిస్తోంది.మంగళవారం యూఎస్ తూర్పు భాగంలో మంచు తుఫాను( Winter Storm ) కారణంగా విద్యుత్ సరఫరాకు అంతరాయాలు ఏర్పడ్డాయి.12 రాష్ట్రాల్లో దాదాపు 8,11,000 గృహాలు, వాణిజ్య కార్యకలాపాలపై దీని ప్రభావం పడింది.ఈ వారాంతంలో న్యూయార్క్,( Newyork ) పెన్సిల్వేనియాల్లో( Pennsylvenia ) పరిస్ధితి తీవ్రంగా వుంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

 Massive Winter Storm Sweeps Across Us High Power Outages Gas Demand To Pose Frig-TeluguStop.com

PowerOutage.us నుండి వచ్చిన డేటా ప్రకారం.

రెండు రాష్ట్రాల్లో 1,82,000 కంటే ఎక్కువ విద్యుత్తు అంతరాయాలు నివేదించాయి.తర్వాత న్యూజెర్సీలో 1,27,000కు పైగా అంతరాయాలు కలిగాయి.

శీతాకాలపు తుఫాను నేపథ్యంలో అయోవాలో( Iowa ) జనవరి 15న జరగబోయే కాకస్‌ల నాటికి ఉష్ణోగ్రతలు సున్నా డిగ్రీల ఫారెన్‌హీట్ కంటే తక్కువకు పడిపోయే అవకాశం వుందని వాతావరణ విభాగం అంచనా వేసింది.తీవ్రమైన వాతావరణ పరిస్థితులు ఇప్పటికే అభ్యర్ధుల షెడ్యూల్‌లకు అంతరాయం కలిగించగా.

ఈవెంట్‌లు సైతం రద్దు చేశారు.తమ మద్ధతుదారులు చలిని తట్టుకోగలరనే ఆశావాదం అభ్యర్ధుల్లో ఉన్నప్పటికీ ఓటింగ్ శాతం పడిపోతుందని వారు భయపడుతున్నారు.

Telugu America, Gas Demand, Gas, Outages, Iowa, Iowa Caucuses, Massive Storm, Yo

ఆర్ధిక సంస్థ ఎల్ఎస్ఈజీ( LSEG ) దేశంలోని దాదాపు సగం ఇళ్లను వేడి చేయడానికి గ్యాస్ డిమాండ్( Gas Demand ) తారా స్థాయిలో వుంటుందని అంచనా వేసింది.జనవరి 15న రోజుకు 170.0 బిలియన్ క్యూబిక్ అడుగులు, జనవరి 16న రోజుకు 173.7 బిలియన్ క్యూబిక్ అడుగులకు డిమాండ్ చేరుకుంటుందని అంచనా.2022 డిసెంబర్‌ నాటి రికార్డులను తాజా డిమాండ్ బద్ధలు కొట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.గ్యాస్ ధరలు( Gas Prices ) గడిచిన ఆరు రోజుల్లో దాదాపు 30 శాతం పెరిగాయి.

డిసెంబర్ 2022 నాటి మంచు తుఫాను సమయంలో గ్యాస్ బావులు, పరికరాల్లో గడ్డకట్టే పరిస్ధితుల కారణంగా పైప్‌లైన్‌లలో గ్యాస్ ప్రవాహాలు తగ్గాయి.

Telugu America, Gas Demand, Gas, Outages, Iowa, Iowa Caucuses, Massive Storm, Yo

దీని వలన తాపన , విద్యుత్ ఉత్పత్తికి గ్యాస్ డిమాండ్ పెరిగింది.ప్రస్తుత పరిస్ధితులు టెక్సాస్, సెంట్రల్ స్టేట్స్‌లో ఫిబ్రవరి 2021 సీజన్‌కు సమాంతరంగా వుందని విశ్లేషకులు అంటున్నారు.మిలియన్ల మంది విద్యుత్, నీరు, వేడి లేకుండా రోజుల తరబడి అల్లాడిపోయారు.

అలాగే 2022 నాటి ఇలియట్ శీతాకాలపు తుఫాను కారణంగా అమెరికాలో తూర్పు ప్రాంతాల్లో విద్యుత్, సహజ వాయువు వ్యవస్థలు దాదాపుగా పతనమయ్యాయి.తాజా తుఫాను మిస్సిస్పిప్పి నదికి( Mississippi River ) తూర్పువైపున వున్న దేశం అంతటా వ్యాపించి .ఈశాన్య దిశగా కదులుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube