కర్ణాటకలోని బెంగళూరులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.బెంగళూరులోని ఓ హోటల్ పై కన్నడ సంఘాలు దాడికి పాల్పడ్డాయి.
వ్యాపార సముదాయాలకు ఇంగ్లీష్ లో బోర్డులు ఉండటంపై కన్నడ సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.ఈ నేపథ్యంలోనే హోటళ్లపై కన్నడ సంఘాలు దాడులు చేశాయి.
అలాగే హోటల్ బోర్డులను కన్నడ రక్షణ వేదిక ధ్వంసం చేసింది.దీంతో బెంగళూరులో హై టెన్షన్ వాతావరణం ఏర్పడింది.
రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళనకారులను అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు.