చెట్లు నరికేటప్పుడు ( Tree cutting )రిస్కులను కూడా ముందుగానే అంచనా వేసుకోవాలి.అంచనా వేయకుండా మూర్ఖంగా నరుక్కుంటూ వెళ్తే ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది.
సేఫ్టీ గేర్ పెట్టుకున్న సరే కొమ్మలు వేగంగా వచ్చి తగిలితే బతికే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి.అయితే ఒక వ్యక్తి ఈ విషయంలో పొరపాటు చేసి చివరికి భారీ మూల్యం చెల్లించుకున్నాడు.
అతడు వంపులు తిరిగిన ఒక కొమ్మ నరికేందుకు కింద నుంచి ట్రై చేశాడు. ఆ చెట్టుకొమ్మను కట్ చేయగలిగాడు కానీ అది నేరుగా వచ్చి తన తలకే తగులుతుందని అసలు ఊహించలేకపోయాడు.
ఫలితంగా ఆ కొమ్మ వచ్చి తగలడం అతడు క్షణాల్లోనే నేలకోలడం జరిగిపోయాయి.దీనికి సంబంధించిన వీడియో ట్విట్టర్ వేదికగా వైరల్ అవుతుంది.
@1000 ways to die అనే ప్రముఖ వైరల్ ట్విట్టర్ పేజీ ఈ వీడియోను షేర్ చేసింది.దీనికి ఇప్పటికే 14 లక్షలు పైగా వ్యూస్ వచ్చాయి. వైరల్ అవుతున్న వీడియో(( Viral video )లో ఒక వ్యక్తి హెల్మెట్ ధరించి ఒక కొమ్మని నరకడం చూడవచ్చు.అయితే అది కట్ అయ్యాక నేరుగా వచ్చి అతడి తలకే తగిలింది.
ఆ పెద్ద పదునైన కొమ్మ చాలా వేగంగా వచ్చి తగలడం వల్ల దవడలు విరిగిపోయినట్లు ఉన్నాయి.ఈ ఘటన తర్వాత అతడు ఆసుపత్రిలో చేరినట్లు, ఆ ఫోటోలు కూడా వైరల్ అయినట్లు కొందరు నెటిజన్లు పేర్కొన్నారు.
అతడి ఫేసు పచ్చడి అయిపోయి మొత్తం ఉబ్బిపోయిందని, కళ్ళు కూడా బయటికి వచ్చేసాయని మరికొందరు పేర్కొన్నారు.గొంతుకు కూడా తీవ్రగాయాల ఈ వ్యక్తి చికిత్స పొందుతూ చనిపోయినట్లు మరికొందరి పేర్కొన్నారు.మొత్తం మీద ఈ వ్యక్తికి చాలా ప్రాణాంతక గాయాలైనట్లు తెలుస్తోంది. ఆస్పత్రికి వెళ్లాక అతడు బతికాడా లేదా అనేది ఎవరూ నిర్ధారించలేదు.ఈ ఘటన ఒక ఫారిన్ కంట్రీలో జరిగినట్టు సమాచారం.ఇది ఏమైనా ఈ జాబ్ కూడా చాలా ప్రమాదకరం.
చెట్లను నరికే వారు ఒకటికి రెండుసార్లు ఆలోచించి జాగ్రత్తలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం చాలా ముఖ్యం.