ఒకవైపు ఆటో నడుపుతూ మరోవైపు కెరీర్ పరంగా లక్ష్యాన్ని సాధించడం సులువు కాదనే సంగతి తెలిసిందే.అయితే ఒక వ్యక్తి మాత్రం రేయింబవళ్లు కష్టపడి కెరీర్ పరంగా సక్సెస్ సాధించారు.
కర్నూలు( Kurnool ) జిల్లాకు 46 కిలోమీటర్ల దూరంలో ఉన్న సి.బెళగల్ ( C.Belagal )మండలంలోని ఇనగండ్ల గ్రామానికి చెందిన చిన్నరాయుడు( Chinnarayudu ) ఆర్థిక ఇబ్బందుల వల్ల డిగ్రీ చదివినా ఆటో నడుపుతూ జీవనం సాగించేవారు.సివిల్ ఎస్సై పరీక్షల కోసం ప్రిపేరై తొలి ప్రయత్నంలోనే సక్సెస్ అయ్యారు.
మారుమూల గ్రామానికి చెందిన చిన్నరాయుడు 2018 సంవత్సరంలో బీకామ్ పూర్తి చేశాడు.కొంతకాలం పాటు తల్లీదండ్రులతో కలిసి వ్యవసాయ పనులు చూసుకున్న చిన్నరాయుడు 2021 సంవత్సరంలో ఆటో కొనుగోలు చేసి ఆటో నడుపుతూ కుటుంబానికి ఏ కష్టం రాకుండా చూసుకున్నాడు.
ఎస్సై ఉద్యోగాలకు( SI jobs ) నోటిఫికేషన్ విడుదలైన తర్వాత కర్నూలులో రూమ్ లో ఉంటూ కష్టపడి చిన్నరాయుడు ప్రిపేర్ అయ్యాడు.

పోలీస్ ఉద్యోగానికి సిద్ధమవుతూ విజయాన్ని సొంతం చేసుకొని ఎంతోమందికి స్పూర్తిగా నిలిచాడు.చిన్నరాయుడు లక్ష్యాన్ని సాధించడంతో కుటుంబ సభ్యుల సంతోషానికి అవధులు లేకుండా పోయాయి.చిన్నరాయుడు తన సక్సెస్ గురించి మాట్లాడుతూ కుటుంబంలో ఎన్ని ఇబ్బందులు ఉన్నా కుటుంబ సభ్యుల నుంచి సహాయసహకారాలు అందాయని చెప్పుకొచ్చారు.

ఎస్సై ఉద్యోగం సాధించడంతో సంతోషంగా ఉందని కామెంట్లు చేశారు.చిన్న రాయుడు భవిష్యత్తులో కెరీర్ పరంగా మరింత సక్సెస్ కావాలని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.చిన్న ఉద్యోగం చేస్తూ కెరీర్ పరంగా సక్సెస్ సాధించాలన్న ఎంతోమందికి చిన్న రాయుడు సక్సెస్ స్టోరీ స్పూర్తిగా నిలుస్తుందని చెప్పవచ్చు.బాల్యం నుంచి చిన్నరాయుడు చదువు విషయంలో ప్రతిభ కనబరిచారని తెలుస్తోంది.
చిన్నరాయుడు ఈ స్థాయికి చేరుకోవడానికి ఎంతో కష్టపడ్డారని సమాచారం అందుతోంది.చిన్నరాయుడు సక్సెస్ స్టోరీ గురించి తెలిసి నెటిజన్లు సైతం ఫిదా అవుతున్నారు.