కొన్ని వందల సంవత్సరాల చరిత్రతో పాటు భక్తులకు కొంగుబంగారమైన దేవాలయాలు మన తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో ఉన్నాయి.అలాంటి వాటిలో నిర్మల్ జిల్లాలోని కుభీర్ మండల కేంద్రంలో ఉన్న శ్రీ విఠలేశ్వర దేవాలయం( Sri Vithaleswara Temple ) కూడా ఒకటి.
ఈ దేవాలయం మహారాష్ట్రలోని పవిత్ర పుణ్యక్షేత్రమైన బండారి విఠలేశ్వర దేవాలయాన్ని తలపిస్తుంది.ఇక్కడ పాండురంగా, విఠలుడు రుక్మిణి దేవి సమేతంగా కొలువై ఉంటాడు.
ఈ దేవాలయంలో పాండారీపురంలో చేసినట్లు ప్రతి రోజు పూజలు చేస్తారు.గర్భగుడి కూడా పండరీపురం విఠలేశ్వరుడి లాగానే ఉంటుంది.
ఈ గర్భగుడిని రాత్రికి రాత్రి కట్టారని పురాణాలు చెబుతున్నాయి.
కంభీర్ లోని శ్రీ విఠలేశ్వర దేవాలయానికి దాదాపు 1400 సంవత్సరాల చరిత్ర ఉందని పురాణాలలో ఉంది.ఇక్కడ ప్రతి సంవత్సరం ఏడు రోజులు శ్రీ విఠలేశ్వర జాతర జరుగుతూ ఉంటుంది.జాతర రోజులలో తాళ సప్తమి వేడుకలు స్పెషల్ అని స్థానిక భక్తులు చెబుతున్నారు.
జాతర ఆఖరి రోజు పూలదండలతో అలంకరించిన రథంతో శ్రీ విఠల రుక్మిణిలను గ్రామంలోని వీధుల గుండా శోభాయాత్ర నిర్వహిస్తారు.ఆ తర్వాత దేవాలయ ప్రాంగణంలో భక్తులు సహపంక్తి భోజనాలు చేస్తారు.
ఈ జాతరానీ చూసేందుకు మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు వస్తూ ఉంటారు.
అలాగే ఇక్కడి విఠలేశ్వర స్వామినీ దర్శించుకుంటే సాక్షాత్తు పండరీపురంలోని విఠలేశ్వరుని దర్శించుకున్నట్లే అని భక్తులు భావిస్తారు. కార్తీకమాసంలోనీ ప్రతి రోజు కాగడా హారతి ఇస్తారు.ఈ హారతి కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని హారతిని దర్శించుకుంటారు.15 రోజులకు ఒకసారి చేసే ఏకాదశి వ్రతాలను తొలి ఏకాదశి నుంచి మొదలుపెడతారు.ఆ రోజు నుంచి ఉపవాస దీక్షలో ప్రారంభిస్తారు.
కార్తీక పౌర్ణమి రోజు ఉట్ల పండుగ చేసుకోవడం ఈ దేవాలయంలో ఆనవాయితీగా వస్తుంది.ఇక్కడ జరిగే ఉట్ల పండుగకు స్పెషాలిటీ ఉంది.
ఒక చిన్నారికి కృష్ణుడి వేషం వేసి తనతో ఉట్టి కొట్టిస్తారు.ఈ దేవాలయంలో వివాహాలు చేసుకుంటే ఆ జంట పిల్లాపాపలతో, ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉంటారని ప్రజలు నమ్ముతారు.
అంతేకాకుండా వివాహ పత్రికని స్వామి పాదాల దగ్గర పెట్టడం సెంటిమెంట్ గా వస్తుంది.
DEVOTIONAL