ముఖ్యంగా చెప్పాలంటే త్రేతాయుగంలో మార్గశిర్ష మాసం శుక్ల పక్షం ఐదవ రోజు శ్రీరాముడు, సీతాదేవి వివాహం చేసుకున్నట్టు పురాణాలలో ఉంది.అందుకే ఈ తేదీకి ఎంతో ప్రాముఖ్యత ఉంది.
కానీ ఈ తేదీన వివాహం చేసుకోవడం శుభప్రదంగా పరిగణించబడదు.ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం.
ఎందుకంటే మత విశ్వాసాల ప్రకారం త్రేతా యుగంలో రాముడు సీతాదేవి ఈ రోజునే వివాహం చేసుకున్నారు.కానీ ఈ తేదీన వివాహం చేసుకోవడం శుభ పరిణామం కాదని ప్రజలు నమ్ముతారు.
ఇంకా చెప్పాలంటే మార్గశిర్ష మాసంలోని శుక్లపక్షం ఐదవ రోజు అంటే డిసెంబర్ 16వ తేదీన రాత్రి 8 గంటలకు మొదలవుతుంది.
అలాగే పంచమి తిధి డిసెంబర్ 17వ తేదీన సాయంత్రం 5 గంటలకు 33 నిమిషములకు ముగుస్తుంది.ఉగాది తిథి ప్రకారం డిసెంబర్ 17వ తేదీన ఆదివారం వివాహ పంచమిని జరుపుకుంటారు.ఇంకా చెప్పాలంటే రాముడు, సీతాదేవి( Rama , Sita ) జంటను హిందూమతంలో ఆదర్శ వైవాహిక జంటగా భావిస్తారు.
అలాగే మార్గశిర్ష మాసంలోని శుక్ల పక్షంలో 5వ రోజున వివాహం జరగడం వల్ల ఈ రోజున శ్రీరాముడు సీతాదేవి వివాహ వార్షికోత్సవం జరుపుకుంటారు.ఈ రోజున సీతాదేవిని రాముడిని ఆరాధించే భక్తుల వైవాహిక జీవితం ఆనందంగా ఉండదని నమ్ముతారు.
ఇంకా చెప్పాలంటే మత విశ్వాసాల ప్రకారం ఈ రోజున వివాహం చేసుకున్న తర్వాత శ్రీరాముడు సీతాదేవి జీవితంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారని కూడా చెబుతున్నారు.అంటే శ్రీరాముడు 14 సంవత్సరాల పాటు వనవాసానికి వెళ్ళాడు.అంతే కాకుండా వనవాసం పూర్తయిన తర్వాత కూడా సీతా దేవి అడవుల్లోనే ఉండాల్సి వచ్చింది.అందుకే ఈ తేదీలో పెళ్లి చేసుకోవడం శుభప్రదం కాదని పండితులు చెబుతున్నారు.
కాబట్టి ప్రజలు ఈ రోజున వివాహం చేయడానికి ఇష్టపడరు.