అల్లం సాగులో వేరు కుళ్ళు తెగుళ్ళ నివారణ కోసం చర్యలు..!

అల్లం పంట సాగులో( cultivation of ginger crop ) లేత నారు మొక్కలకు ఆశించే కుళ్ళు తెగుళ్లు జెనస్ పాలిథియం( Genus Polytheum ) అనే ఫంగస్ వల్ల పంటను ఆశిస్తుంది.ఈ ఫంగస్ మట్టిలోని పంట అవశేషాలలో కొన్ని సంవత్సరాలపాటు జీవించి ఉంటుంది.

 Actions For The Prevention Of Root Rot Pests In Ginger Cultivation , Ginger Cult-TeluguStop.com

నేలలో అధిక తేమ ఉన్నప్పుడు మొక్కల పేర్లకు త్వరితంగా వృద్ధి చెందుతుంది.పొలంలో నీరు నిలిచి ఉన్న లేదంటే అధికంగా నత్రజని ఉపయోగించిన మొక్కలు బలహీన పడతాయి అప్పుడు ఈ తెగులు వృద్ధి చెందే అవకాశం ఉంది.

కలుషితమైన పరికరాల వల్ల కూడా ఈ ఫంగస్ బీజంశాలు వ్యాప్తి చెందుతాయి.

మొక్కలు ఏ దశలో ఉన్నా కూడా ఈ తెగులు సోకే అవకాశం ఉంది.వేరు కుళ్ళు తెగుళ్లు మొలకలు రాకముందు లేదంటే మొలకలు వచ్చిన తర్వాత కూడా పంటకు ఆశించే అవకాశం ఉంది.మొలకలు రాకముందు అంటే విత్తనం వేసిన వెంటనే విత్తనాన్ని ఈ ఫంగస్( fungus ) ఆవాసంగా ఏర్పరచుకుంటుంది.

దీంతో విత్తనం కూలిపోయి అంకురోత్పత్తి ఆగిపోతుంది.మొలకలు వచ్చిన తర్వాత అయితే మొక్క ఎదుగుదల ఆగిపోతుంది.

మొక్క మొదలవల్ల సన్నని బూడిద రంగు లేదా గోధుమ రంగు నల్లని మచ్చలు కనిపిస్తాయి.

ఈ తెగులు పంటకు సోకకూడదంటే.తెగులు నిరోధక సర్టిఫైడ్ విత్తనాలు( Pest resistant certified seeds ) ఎంపిక చేసుకొని సాగు ప్రారంభించాలి.పొలంలో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

విత్తనాలను ఎక్కువ లోతుగా నాటకూడదు.నత్రజనిని ఒకేసారి కాకుండా విడతల వారీగా వేయాలి.

నీటి తడిని రాత్రి పూట కాకుండా ఉదయం పూట పెట్టాలి.పంట కోత అనంతరం పంట అవశేషాలను నాశనం చేయాలి.

పొలంలో ఈ తెగుళ్లను గుర్తించిన వెంటనే మెటలాక్సిల్-ఎం 75% ను మొక్కల ఆకులు పూర్తిగా తడిచేటట్లు పిచికారి చేయాలి.మొక్క మొదళ్ళ ను ప్రతి 15 రోజులకు ఒకసారి కాపర్ ఆక్సి క్లోరైడ్ తో తడపాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube